Begin typing your search above and press return to search.
ఒరిజినల్ కు మించిన బూతు రీమేక్ లో ఉంటుందట!
By: Tupaki Desk | 2 Jan 2021 3:10 PM ISTకార్తికేయ.. పాయల్ రాజ్ పూత్ జంటగా అజయ్ భూపతి దర్శకత్వంలో రూపొందిన 'ఆర్‌ఎక్స్ 100' విడుదలై ఏళ్లు గడుస్తున్నా కూడా ఇంకా జనాలు సినిమా గురించి చర్చించుకుంటూనే ఉన్నారు. ఆ సినిమాలో హీరోయిన్ పాత్ర బోల్డ్ గా ఉంటుంది. నెగటివ్ షేడ్స్ ఉన్న హీరోయిన్ పాత్ర హీరో పాత్రతో చేసే రొమాన్స్ యూత్ ఆడియన్స్ ను కట్టిపడేశాయి. ఆ సినిమా అంతగా సక్సెస్ అవ్వడానికి కారణం బోల్డ్ కంటెంట్ అనడంలో సందేహం లేదు. ఈ బోల్డ్ మూవీని హిందీలో రీమేక్ చేస్తున్న విషయం తెల్సిందే. రీమేక్ లో అంతకు మించి అన్నట్లుగా బోల్డ్ కంటెంట్ ను జొప్పిస్తున్నారట.
సునీల్ శెట్టి తనయుడు అహన్ శెట్టి హీరోగా పరిచయం అవ్వబోతున్న ఈ సినిమాలో హీరోయిన్ గా తార సుతారియా నటిస్తుంది. పాయల్ పాత్రను ఈమె అంతకు మించి అన్నట్లుగా రక్తి కట్టించబోతుందట. బోల్డ్ పాత్రలో ఇప్పటికే తారా సుతారియా ఆకట్టుకుంటుంది. ఈ రీమేక్ లో ఆమె మరింత రెచ్చి పోయ నటిస్తున్నట్లుగా తెలుస్తోంది. రీమేక్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. త్వరలోనే షూటింగ్ ను పూర్తి చేసి ఈ ఏడాదిలోనే రీమేక్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈమద్య కాలంలో తెలుగు లో వచ్చిన సినిమాలు హిందీలో రీమేక్ అయ్యి మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. కనుక ఖచ్చితంగా ఈ రీమేక్ కూడా హిందీలో ఆకట్టుకుంటుందని.. దీనికి అదనంగా బోల్డ్ కంటెంట్ ఉంది కనుక మరింత ఘన విజయం సాధిస్తుందనే నమ్మకంను వ్యక్తం చేస్తున్నారు.