Begin typing your search above and press return to search.

ఆ హీరోను బెస్ట్‌ కిస్సర్‌ అనేసిన హీరోయిన్‌

By:  Tupaki Desk   |   3 May 2019 1:30 AM GMT
ఆ హీరోను బెస్ట్‌ కిస్సర్‌ అనేసిన హీరోయిన్‌
X
బాలీవుడ్‌ సినిమాల్లో లిప్‌ లాక్‌ సీన్స్‌ చాలా కామన్‌ అయ్యాయి. అయితే బాలీవుడ్‌ లో బెస్ట్‌ కిస్సర్‌ ఎవరు అనే విషయమై తాజాగా ఒక రేడియో కార్యక్రమంలో యంగ్‌ హీరో టైగర్‌ ష్రఫ్‌ స్పందిస్తూ ముద్దు పెట్టడంలో నేనే బెస్ట్‌ అనుకుంటాను - నాకు నేను బెస్ట్‌ అని మాత్రం అనుకుంటున్నాను అన్నాడు. టైగర్‌ కెరీర్‌ ఆరంభం నుండి దాదాపు తన ప్రతి సినిమాలో కూడా లిప్‌ లాక్‌ సీన్స్‌ చేశాడు. అందుకే తనకు తాను బెస్ట్‌ కిస్సర్‌ అని కితాబు ఇచ్చుకుని ఉంటాడు.

అదే రేడియో కార్యక్రమంలో పాల్గొన్న హీరోయిన్స్‌ అనన్య పాండే మరియు తారా సుతారియాలు స్పందిస్తూ ఔను నిజంగానే టైగర్‌ బెస్ట్‌ కిస్సర్‌ అన్నారు. నా తొలి ముద్దు టైగర్‌ ష్రాఫ్‌ తోనే కనుక నాకు బెస్ట్‌ కిస్సర్‌ గా అతడే తెలుసు అని అనన్య చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈమె టైగర్‌ తో కలిసి 'స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌ 2' చిత్రంలో నటిస్తోంది.

ఈ చిత్రంతో హీరోయిన్‌ గా పరిచయం అవుతున్న అనన్య తన మొదటి సినిమాతోనే అందాల ప్రదర్శణ చేయడంతో పాటు ముద్దు సీన్‌ లతో అలరించబోతుంది. ఇటీవలే వీరి ముద్దు సీన్‌ కు సంబంధించిన ఒక స్టిల్‌ బయటకు వచ్చింది. సోషల్‌ మీడియాలో అది కాస్త వైరల్‌ అయ్యింది. టైగర్‌ తో ఈమె చేస్తున్న రొమాన్స్‌ తో స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌ 2 ఖచ్చితంగా సక్సెస్‌ అవుతుందనే నమ్మకంతో బాలీవుడ్‌ ప్రేక్షకులు ఉన్నారు.