Begin typing your search above and press return to search.

చాలా పచ్చిగా మాట్లాడుతున్న తాప్సి

By:  Tupaki Desk   |   28 March 2022 4:27 AM GMT
చాలా పచ్చిగా మాట్లాడుతున్న తాప్సి
X
తాప్సి ప్రథాన పాత్రలో తెరకెక్కిన మిషన్ ఇంపాజిబుల్ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. భారీ ఎత్తున ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు చేస్తున్నారు. సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా హీరోయిన్‌ తాప్సి మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఈమె మాట్లాడుతూ హీరోయిన్‌ ల పారితోషికం విషయమై స్పందించింది.

హీరోయిన్స్ పారితోషికం వారు థియేటర్లకు ప్రేక్షకులను రాబట్టే స్టామినా ఆధారంగా బాలీవుడ్‌ లో ఇస్తారు. అక్కడి ప్రేక్షకుల మౌత్‌ టాక్‌ పాజిటివ్‌ గా వచ్చిన తర్వాత మాత్రమే సినిమా కు జనాలు పెరుగుతారు.. కలెక్షన్స్ పెరుగుతాయి అంటూ తాప్సి చెప్పుకొచ్చింది. హీరోయిన్స్‌ అందాలను ఆరబోస్తే అప్పుడు ప్రేక్షకులు టాక్‌ తో సంబంధం లేకుండా వస్తారు అంటూ కాస్త పచ్చిగా మాట్లాడి బాలీవుడ్‌ జనాలపై అసంతృప్తి వ్యక్తం చేసింది.

సౌత్‌ లో హీరోయిన్ గా పరిచయం అయ్యి మంచి విజయాన్ని సొంతం చేసుకున్న ఈ అమ్మడు అనూహ్యంగా బాలీవుడ్ కు వెళ్లింది. అక్కడ మెల్ల మెల్లగా చిన్న సినిమాల్లో నటిస్తూ ప్రస్తుతం అక్కడ స్టార్‌ హీరోయిన్ గా నిలిచింది. స్టార్‌ హీరోలు ఈమెను పట్టించుకోకున్నా కంటెంట్‌ ఓరియంటెడ్‌ సినిమాల్లో ఈమె నటించడం ద్వారా మంచి పాపులారిటీని దక్కించుకుంటూ వస్తుంది అంటూ నెటిజన్స్‌ కామెంట్స్ చేస్తున్నారు.

మిషన్ ఇంపాజిబుల్ చిత్రం తో ఈమె ప్రతి ఒక్క సినీ ప్రేక్షకుడిని అలరిస్తుందనే నమ్మకంను యూనిట్‌ సభ్యులు వ్యక్తం చేస్తున్నారు. కొత్త కాన్సెప్ట్‌ లతో చాలా విభిన్నమైన సినిమాలతో ఈ అమ్మడు ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఆ సినిమాలకు సంబంధించిన టాక్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

హీరోయిన్ గా తాప్సి బాలీవుడ్‌ లో టాప్‌ అనిపించుకున్నా పారితోషికం విషయంలో మాత్రం ఆమె ఇంకా చాలా తక్కువ స్థాయి లోనే ఉంది అనేది కొందరి అభిప్రాయం.

ఆమె ప్రేక్షకులను థియేటర్లకు రప్పించే వారికి మాత్రమే పారితోషికం అధికంగా ఉంటుందని చేసిన వ్యాఖ్యలు అందుకు సంకేతం అయ్యి ఉంటాయి అంటూ మరి కొందరు కామెంట్స్ చేస్తున్నారు.