Begin typing your search above and press return to search.

మళ్లీ ఝుమ్మంటుంది.. తాప్సీ ఈజ్ బ్యాక్

By:  Tupaki Desk   |   2 Jan 2021 2:15 PM IST
మళ్లీ ఝుమ్మంటుంది.. తాప్సీ ఈజ్ బ్యాక్
X
‘తాప్సీ పన్నూ..’ 2010లో ‘ఝుమ్మంది నాదం’ అంటూ తెలుగు తెరపై ఎంట్రీ ఇచ్చిన ఈ సుందరి.. యూత్ గుండెల్లో కోటి వీణలు మోగించింది. అరుదైన దర్శకేంద్రుడి పండ్లతో కొట్టించుకొని.. కుర్ర ఆడియన్స్ తో ‘అబ్బా’ అనిపించింది. ఆ తర్వాత మూడ్నాలుగు సినిమాల్లో కనిపించిన ఈ బ్యూటీ.. ఫ్యాన్స్ హృదయవీణ తీగలు తెంపేసి బాలీవుడ్ చెక్కేసింది. ఇన్నాళ్లకు వెనక్కి వచ్చేస్తుండడంతో తెగిన తంత్రులు.. మళ్లీ శ్రావ్యంగా మోగబోతున్నాయి.

బాలీవుడ్ కు వెళ్లిన తాప్సీ.. అక్కడ తన సామర్థ్యాన్ని నిరూపించుకుంది. కథా ప్రాధాన్యమున్న పాత్రలను సెలక్ట్ చేసుకుంటూ సక్సెస్ సాధిస్తూ ముందుకు దూసుకెళ్లింది. ప్రస్తుతం.. బాలీవుడ్ లో రెండు బయోపిక్ లలో నటిస్తోంది తాప్సీ పన్నూ. స్పోర్ట్స్ డ్రామాలు తెరకెక్కుతున్న ఈ చిత్రాలతో ఫుల్ బిజీగా ఉంది ఈ బ్యూటీ.

కాగా.. టాలీవుడ్ కి తిరిగి రావడానికి ప్లాన్ చేస్తోంది. దర్శకుడు ‘తేజ’ నెక్ట్స్ మూవీ ‘అలివేలు వెంకటరమణ’ చిత్రంలో నటించడానికి సైన్ చేసింది. ఈ రొమాంటిక్ మూవీ త్వరలో సెట్స్ పైకి వెళ్తుందని సమాచారం.

అయితే.. ఈ చిత్రంలో హీరోగా ముందు గోపిచంద్ ను అనుకున్నాడట దర్శకుడు తేజ. అయితే.. అందుతున్న అప్డేట్స్ ప్రకారం గోపీచంద్ ఈ ప్రాజెక్టులో భాగం కాలేదని తెలుస్తోంది. ఇక హీరోయిన్ పాత్ర కోసం కాజల్ అగర్వాల్ తదితరుల పేర్లు పరిశీలించినప్పటికీ.. ఫైనల్ గా తాప్సీని ఖరారు చేశాడట డైరెక్టర్. ఈ సినిమా కథ కూడా ఆమెకు వినిపించాడని, సాటిస్ఫై అయిన తాప్సీ ఓకే చెప్పేసిందని టాక్.

కాగా.. ప్రధాన నటుడి పాత్రకు ఒక యువ తమిళ నటుడిని తేజా ఫైనల్ చేసినట్టు తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్ స్క్రిప్ట్ వర్క్ ఇటీవలే పూర్తయింది. ఈ ‘అలివేలు వెంకటరమణ’ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించబోతోంది. త్వరలోనే షూట్ స్టార్ట్ చేసి, ఈ సంవత్సరంలోనే సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నాడట డైరెక్టర్.