Begin typing your search above and press return to search.

క‌థ‌ల్లేక.. చాలా ట్యాలెంట్ ఇంతే!

By:  Tupaki Desk   |   19 Feb 2020 9:47 AM GMT
క‌థ‌ల్లేక.. చాలా ట్యాలెంట్ ఇంతే!
X
క‌థ‌ను బ‌ట్టి.. పాత్ర‌ను బ‌ట్టి న‌టీన‌టుల‌కు నిరూపించుకునే అవ‌కాశం ఉంటుంది. కొంద‌రి విష‌యంలో అది కాస్త డిఫ‌రెంట్ గా ఉంటుంది. అరుదుగా కొంద‌రు స్టార్లు ఏదీ లేక‌పోయినా వైబ్రేంట్ గా త‌మ‌ని తాము తెర‌పై ప్రెజెంట్ చేసుకుని నెగ్గుకొస్తారు. అయితే తాప్సీ లాంటి న‌టి ఆరంభం తెలుగులో గ్లామ‌ర్ పాత్ర‌ల‌కు ప‌రిమితం కావ‌డంతో న‌టిగా నిరూపించుకునే ఛాన్స్ రాలేదు. అయితే లోటు పాట్లు తెలుసుకున్న తాప్సీ ముంబై ప‌రిశ్ర‌మ‌కు వెళ్లిపోయింది. సౌత్ లో చేయ‌లేనిది బాలీవుడ్ లో చేసి చూపించింది.

పైగా హిందీలో ఔత్సాహిక ఫిలింమేక‌ర్స్ తాప్సీని మ‌రో కొత్త కోణం లో చూపించ‌డంలోనూ స‌ఫ‌ల‌మ‌య్యారు. ముఖ్యంగా గాళ్స్ లో ఇమేజ్ పెంచే ఆస‌క్తిక‌ర పాత్ర‌ల్ని ఎంపిక చేసుకుని తాప్సీ చేసిన ప్ర‌యోగాల‌న్నీ స‌ఫ‌లం అయ్యాయి. అక్క‌డ‌ పింక్ - నామ్ ష‌బానా- మ‌న్మార్జియాన్ అంటూ కిక్ పెంచే చిత్రాల్లో న‌టించి మెప్పించింది. ఇవ‌న్నీ వైవిధ్యం ఉన్న క‌థ‌లు.. న‌టించేందుకు స్కోప్ ఉన్న పాత్ర‌ల‌తో ర‌క్తి క‌ట్టించాయి. అలాంటి క‌థ‌ల్ని తాప్సీకి ఇచ్చిన ద‌ర్శ‌క‌నిర్మాత‌ల‌కే ఆ క్రెడిట్ ద‌క్కుతుంద‌ని చెప్పాలి.

ఇదే హుషారులో తాప్సీ ఇప్ప‌టికీ వ‌రుస ప్ర‌యోగాలు చేస్తోంది. ప్ర‌స్తుతం జ‌ర్మ‌న్ మూవీ `రన్ లోలా రన్` రీమేక్ కి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. 1999 లో రిలీజైన ర‌న్ లోలా ర‌న్ అప్ప‌ట్లో ఆస్కార్ కి నామినేట్ అయ్యింది. దాదాపు రెండు ద‌శాబ్ధాల‌కు బాలీవుడ్ లో రీమేక‌వుతోంది. పోగొట్టుకున్న డ‌బ్బును కాపాడుకోవ‌డం... ప్రియుడిని ర‌క్షించుకోవ‌డం అనే కాన్సెప్టు తో వ‌చ్చిన ర‌న్ లోలా అప్ప‌ట్లో ప్రేక్ష‌కుల మ‌న‌సు దోచింది. టామ్‌ టైక్వెర్‌ దర్శకత్వం వహించారు. ఈ రీమేక్ లో తాప్సీకి న‌టించే స్కోప్ ఉంది. హిందీలో ఈ సినిమాను సోనీ పిక్చర్స్ రీమేక్ చేస్తోంది. 2020 జనవరి 29న ఈ మూవీ రిలీజ్ కానుంది. అన్న‌ట్టు తాప్సీకి చిక్కిన‌ట్టు మంచి క‌థ‌లు చిక్కితే ఇక్క‌డ సౌత్ భామ‌లే ఇర‌గ‌దీస్తారు. మంచి క‌థ‌లు.. మంచి పాత్ర‌లు దొర‌క్క ప్ర‌తిభ తెర‌వెన‌కే ఉండిపోతోంది. దానిని వెలుగులోకి తెచ్చే ద‌ర్శ‌కులు ఇప్పుడొస్తున్నారు.