Begin typing your search above and press return to search.
షారూఖ్ ఖాన్ సరసన తాప్సీ..?
By: Tupaki Desk | 18 Jan 2021 3:10 PM IST'తాప్సీ పన్నూ..’ ఝుమ్మంది నాదం సినిమాతో తెలుగు తెరపై తొలిసారిగా మెరిసిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత బాలీవుడ్ బాట పట్టి తనదైన గుర్తింపు తెచ్చుకుంది. ప్రాధాన్యముండే పాత్రలనే సెలక్ట్ చేసుకుంటూ.. సక్సెస్ ను టేస్ట్ చేస్తూ ముందుకు సాగుతోంది ఈ అమ్మడు. ప్రస్తుతం "రష్మి రాకెట్" అనే మూవీలో నటిస్తోంది తాప్సీ. అథ్లెట్ బ్యాక్ డ్రాప్ లో కొనసాగే ఈ మూవీలో రన్నర్ పాత్ర పోషిస్తోంది. తన గుర్తింపు కోసం పోరాడి అథ్లెట్ గా రాణించిన ఓ రన్నర్ పాత్రను తాప్సీ పోషిస్తోంది. ఆకర్ష్ ఖురానా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ప్రియాన్షు పెన్యులి తాప్సీ భర్తగా నటిస్తున్నారు.
కాగా.. ఇకపై బికినీలో కనిపించను అంటూ ఇటీవల ఓ స్టేట్ మెంట్ ఇచ్చిందీ బ్యూటీ. సోషల్ మీడియాకు తన బికినీ ఫొటోలు ఇకపై రావని చెప్పింది తాప్సీ. చిట్టిపొట్టి దుస్తుల్లో తనను అభిమానులు ఊహించుకోలేరని చెప్పుకొచ్చిందీ భామ. తాను ఇప్పటి వరకూ ‘జుద్వా’లో తప్ప మరే ఇతర సినిమాలోనూ బికినీలో కనిపించలేదని చెప్పిన తాప్సీ.. నటనకు ప్రాధాన్యమున్న పాత్రల్నే ఎంచుకుంటానని పరోక్షంగా చెప్పేసింది.
అయితే.. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం బాలీవుడ్ బాద్షా షారూక్‌ఖాన్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిందని టాక్. ఈ మేరకు బాలీవుడ్ సర్కిల్స్ లో కబర్ షికార్ చేస్తోంది. రాజ్ కుమార్ హిరాణి - షారూక్ కాంబోలో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో తాప్సీ హీరోయిన్‌గా నటించనుందని సమాచారం. మరి, ఇది నిజమేనా? కాదా అన్న సంగతి తేలాల్సి ఉంది.