Begin typing your search above and press return to search.

తాప్సీతో బీచ్ సెల‌బ్రేష‌న్ లో సీక్రెట్ గ‌య్ ఎవ‌రు?

By:  Tupaki Desk   |   14 Oct 2020 1:00 PM IST
తాప్సీతో బీచ్ సెల‌బ్రేష‌న్ లో సీక్రెట్ గ‌య్ ఎవ‌రు?
X
ఇండ‌స్ట్రీలో అన్నీ తీపి క‌బుర్లు.. శుభ‌వార్త‌లు.. వినిపిస్తున్నాయ్! కొంద‌రు భామ‌లు పెళ్లి బంధంతో ఏక‌మ‌వుతుంటే.. మ‌రికొంద‌రు బేబి బంప్ తో తీపి క‌బురు వినిపిస్తున్నారు. మొత్తానికి బాలీవుడ్ టాలీవుడ్ అన్నిచోట్లా ఈ సంద‌డి క‌నిపిస్తోంది. అనుష్క‌శ‌ర్మ‌.. క‌రీనా.. అనిత హ‌స‌నందానీ.. వీళ్లంతా బేబి బంప్ వార్త‌ల‌తో వార్తా క‌థ‌నాల్లో హైలైట్ అయ్యారు. చంద‌మామ కాజ‌ల్ స‌డెన్ పెళ్లి కూడా హీట్ పెంచింది.

ఇప్పుడు తాప్సీ వంతు. తాప్సీ పన్నూ సీక్రెట్ ఒకటి బ‌య‌ట‌ప‌డింది. చాలా కాలంగా రూమర్డ్ బ్యూయో మాథ్యూస్ బో తో తాప్సీ డేటింగ్ చేస్తోంద‌ని గుస‌గుస‌లు వినిపించాయి. ఇప్ప‌టికీ అప్పుడ‌ప్పుడు జాతీయ మీడియా క‌థ‌నాలు గాసిప్పుల‌తో వేడెక్కిస్తూనే ఉన్నాయి.

అయితే అత‌డు మాల్దీవులలో తాప్సీ చెంత వాలిపోయాడా? తాప్సీ ఫ్యామిలీతో క‌లిసి సెల‌బ్రేట్ చేస్తున్నాడా? అంటే ఇదిగో ఈ డ్యాన్స్ పోజ్ ని ప్రూఫ్ గా చూపిస్తోంది జాతీయ మీడియా. భ‌లే ఫోజు కొట్టాడుగా అంటూ ఒక ఫోటోని ప్ర‌ఖ్యాత‌ రిల‌య‌న్స్ ఎంట‌ర్ టైన్ మెంట్స్ కి చెందిన వెబ్ మీడియా క‌థ‌నం ప్రచురించింది. ప్రేమికులు తాప్సీ పన్నూ - రూమర్డ్ బ్యూ మాథియాస్ బో మాల్దీవులలో డ్యాన్స్ పోజ్ కొట్టారు చూడండి అంటూ ఫోటో ఒక‌టి వైర‌ల్ చేయ‌డం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. తాప్సీ తో పాటు ప్రియుడు మాథ్యూస్ బో సెలవులో ఉన్నారు. మాల్దీవుల్లోని బీచ్ లో ఇదిగో ఇలా చిలౌట్ చేస్తున్నారు అంటూ ఆ ఫోటోను స‌ద‌రు మీడియా వైర‌ల్ చేయ‌డం ఆస‌క్తిక‌రం.

తాప్సీ పన్నూ ఇటీవల తన సోదరీమణులతో కలిసి మాల్దీవుల్లో విహారయాత్రలో ఉన్నార‌న్న సంగ‌తి విధిత‌మే. అయితే అక్క‌డికి ప్రియుడు మాథ్యూస్ బో ఉన్నారా? అన్న‌ది స‌స్పెన్స్ గా మారింది. బ్యాడ్మింటన్ ప్లేయర్ అయిన ఆయ‌న‌తో ఇలా ఫోటో దిగ‌డ‌మేమిటా? అంటూ హిందీ మీడియాలో ఒక‌టే గుస‌గుస‌లు వేడెక్కిస్తున్నాయి. ఈ జంట ఒక సుందరమైన ఆహ్లాద‌క‌ర‌మైన‌ ప్రదేశంలో వారి విలువైన సమయాన్ని ఆస్వాధిస్తున్నారు. ఆ ఇద్దరూ తెల్లని ఇసుక మీద డ్యాన్స్ పోజులివ్వ‌డం ఆ వెనుకగా బులుగు సముద్రం నుంచి కాంతులు ప‌రుచుకున్నాయి ఆ ఫోటోలో.

తాప్సీ పన్నూ మాథియాస్ అలానే సోదరీమణులు ఇవానియా .. షాగున్ లతో కలిసి మాల్దీవుల్లో వారం రోజుల పాటు ఎంజాయ్ చేయ‌నున్నార‌ట‌. ఇటీవల సోషల్ మీడియాలో ఒక ఫన్నీ వీడియోను తాప్సీ పంచుకున్నారు. ఇందులో మాథ్యూస్ కూడా ఉన్నారు. ఆ క్లిప్ ‌లో తాప్సీ.. ఆమె సోదరీమణులు యశ్ రాజ్ ముఖతే రాసిన బికినీ షూట్ మాషప్ పాటను ప్రదర్శించడం వేడి పెంచింది. యష్ రాజ్ `రాసోడ్ మెయిన్ కౌన్` మాష్ అప్ వీడియో ఇటీవల వైరల్ అయ్యింది. తాప్సీ కేవ‌లం బంధువుల‌తోనే ఇలా చిలౌట్ చేస్తోందా? అస‌లు మాథ్యూస్ ఎందుకు చేరిన‌ట్టు అక్క‌డికి? అంటూ ఒక‌టే గుస‌గుస‌లు వేడెక్కించేస్తున్నాయ్. తాప్సీ కెరీర్ సంగ‌తి చూస్తే.. వినిల్ మాథ్యూ `హసీన్ దిల్‌రూబా` (విక్రాంత్ మాస్సే కూడా నటించింది).. ఆకాష్ భాటియా ``లూప్ లాపెటా`.. రాహుల్ ధోలాకియా `షాబాష్ మిథు` చిత్రాల్లో న‌టిస్తోంది.