Begin typing your search above and press return to search.

పబ్లిసిటీ కోసమే ఈ కాంట్రవర్సీ కామెంట్సా?

By:  Tupaki Desk   |   3 March 2020 5:17 AM GMT
పబ్లిసిటీ కోసమే ఈ కాంట్రవర్సీ కామెంట్సా?
X
సౌత్‌ నుండి బాలీవుడ్‌ కు వలస వెళ్లిన హీరోయిన్స్‌ లో ఎక్కువ శాతం సక్సెస్‌ లను దక్కించుకోలేక పోయారు. కొందరు ఒకటి రెండు సంవత్సరాలు నిలిచినా ఆ తర్వాత జాడా పత్తా కనిపించకుండా పోయారు. కాని తాప్సి మాత్రం సౌత్‌ లో తాను దక్కించుకోలేనిది బాలీవుడ్‌ కు వెళ్లి అక్కడ సాధిస్తోంది. ఈ అమ్మడు చేస్తున్న సినిమాలు చూస్తుంటే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. కమర్షియల్‌ సినిమాల్లో ఛాన్స్‌ లు రాకున్నా వరుసగా కాన్సెప్ట్‌ బెస్డ్‌ లేదంటే లేడీ ఓరియంటెడ్‌ చిత్రాలను చేస్తూ గుర్తింపును దక్కించుకుంటుంది.

ఈ అమ్మడు ప్రస్తుతం బాలీవుడ్‌ లో వరుస చిత్రాలతో పాపులర్‌ హీరోయిన్‌ గా మారిపోయింది. తాజాగా ఈమె థప్పడ్‌ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తాప్సి గత చిత్రాల మాదిరిగా ఈ సినిమా కూడా బాక్సాపీస్‌ వద్ద మంచి వసూళ్లను రాబడుతోంది. ఇదే సమయంలో సినిమాలోని తాప్సి నటనకు ప్రశంసలు కురుస్తున్నాయి. సినిమా ప్రమోషన్‌ లో తాప్సి చాలా యాక్టివ్‌ గా పాల్గొంటుంది. ఇదే సమయంలో ఈ అమ్మడు చేస్తున్న కామెంట్స్‌ సినీ వర్గాల్లో చర్చనీయాంశం అవుతున్నాయి.

ఇటీవలే కొందరు హీరోలు నాతో నటించేందుకు ఆసక్తి చూపడం లేదు. నాతో నటిస్తే వారిని ప్రేక్షకులు పట్టించుకోరేమో అనేది వారి భయం అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. ఆ హీరోలు ఎవరు అంటే మాత్రం చెప్పను అంది.

ఇప్పుడు హీరోయిన్స్‌ పై ఈ అమ్మడు కామెంట్స్‌ చేసింది. స్టార్‌ కిడ్స్‌ కొందరు తన వద్దకు వచ్చిన ఆఫర్లను తన్నుకు పోయారు అంది. తాను స్టార్‌ కిడ్‌ ను అవ్వక పోవడం వల్లే కమర్షియల్‌ బిగ్‌ చిత్రాల్లో ఛాన్స్‌ లు రావడం లేదంటూ వ్యాఖ్యలు చేసింది. ఇండస్ట్రీ లో వారినే ఎక్కువగా పట్టించుకుంటారు అంటూ స్టార్‌ కిడ్స్‌ హీరోయిన్స్‌ పై కామెంట్స్‌ చేసింది.

ఇంతకు ఈమె వద్ద నుండి సినిమాలు లాక్కెల్లిన ఆ స్టార్‌ కిడ్స్‌ ఎవరు అనేది మాత్రం చెప్పడం లేదు. అంతకు ముందు సౌత్‌ హీరోలతో కామెంట్స్‌ చేయడం.. ఇలా ఆమె కామెంట్స్‌ తో వార్తల్లో నిలుస్తూనే ఉంది. పబ్లిసిటీ దక్కించుకోవడం కోసం ఇలాంటి కాంట్రవర్సీ కామెంట్స్‌ చేస్తుందా అనే అనుమానాలు కొందరు వ్యక్తం చేస్తున్నారు.