Begin typing your search above and press return to search.

కుర్ర హీరోలపై తాప్సి షాకింగ్‌ కామెంట్స్‌

By:  Tupaki Desk   |   2 March 2020 4:45 AM GMT
కుర్ర హీరోలపై తాప్సి షాకింగ్‌ కామెంట్స్‌
X
సౌత్‌ నుండి వెళ్లిన ముద్దుగుమ్మ తాప్సి ప్రస్తుతం బాలీవుడ్‌ లో సక్సెస్‌ ఫుల్‌ హీరోయిన్‌ గా దూసుకు పోతుంది. ఈ అమ్మడు తాజాగా థప్పడ్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. లేడీ ఓరియంటెడ్‌ చిత్రాలకు పెట్టింది పేరు అన్నట్లుగా మారిపోయిన ఈ అమ్మడు తాజాగా థప్పడ్‌ సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాల్లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ యంగ్‌ హీరోలపై ఆసక్తికర కామెంట్స్‌ చేసింది.

కొందరు హీరోయిన్స్‌ కు స్టార్‌ హీరోలు ఛాన్స్‌ ఇవ్వడం లేదు.. కొత్త హీరోలు కుర్ర హీరోలు వారితో నటించేందుకు ఆసక్తి చూపడం లేదు అంటూ చెప్పుకొచ్చింది. నాతో నటించేందుకు పలువురు హీరోలు ఆసక్తి చూపించలేదు. ఎందుకంటే నాతో నటిస్తే వారిని ప్రేక్షకులు పట్టించుకోరు అనేది వారి అభిప్రాయం. నన్ను హీరోయిన్‌ గా వద్దన్న వారు చాలా మంది హీరోలు కొన్ని సినిమాలు చేసి కనిపించకుండా పోయారంటూ చెప్పుకొచ్చింది. యంగ్‌ హీరోలు ఒక రేంజ్‌ హీరోలతో నటించడం వల్ల వారికి గుర్తింపు రాదు. ఆ కారణంగానే తాప్సిని కొందరు వద్దన్నారట.

ఆ హీరోలు బాలీవుడ్‌ వారా లేదంటే సౌత్‌ హీరోలా అనే విషయాన్ని మాత్రం ఈ అమ్మడు చెప్పలేదు. తాప్సి హీరోయిన్‌ గా ప్రస్తుతం హిందీ లో ఎక్కువగా లేడీ ఓరియంటెడ్‌ చిత్రాలు మాత్రమే చేస్తుంది. కనుక అక్కడి యంగ్‌ హీరోలే తాప్సిని వద్దని ఉంటారు అంటూ నెటిజన్స్‌ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. హీరోలు కాదన్నా కూడా మంచి పేరు దక్కించుకుని వరుస గా సక్సెస్‌ లను ఈ అమ్మడు కొట్టడం అభినందనీయం.