Begin typing your search above and press return to search.

ముంబైలో పెద్దింటికి తాప్సీ మెరుగులు

By:  Tupaki Desk   |   4 Dec 2016 4:33 PM GMT
ముంబైలో పెద్దింటికి తాప్సీ మెరుగులు
X
చిన్నిల్లు.. పెద్దిల్లు కాన్సెప్ట్ వినగానే ఇద్దరు పెళ్లాలు అనే కాన్సెప్ట్ ని తెలుగు సినీ జనాలు బాగా వంట బట్టించేశారు. కానీ ఉన్న ఇల్లు సరిపోకపోతే.. పెద్ద ఇంటిని కొనుగోలు చేసి మారడం అనేది సహజంగా జరిగేదే. ఇప్పుడు ఢిల్లీ బ్యూటీ తాప్సీ పన్ను ముంబైలో అదే చేస్తోంది.

ఇప్పటికే తాప్సీకి ముంబైలో ఓ సొంత ఫ్లాట్ ఉంది కానీ.. కాసింత విశాలమైన ఇంటిలోకి మారే ఉద్దేశ్యంతో కొత్తింటిని కొనేసింది. ముంబైలోని ఒషివారా ప్రాంతంలో కొత్త అపార్ట్ మెంట్ ను తాప్సీ ఖరీదు చేయగా.. ప్రస్తుతం దీని నిర్మాణం చివరి దశలో ఉంది. బాలీవుడ్ జనాల నుంచి వినిపిస్తున్న టాక్ ప్రకారం వచ్చే ఏడాది మార్చ్ ప్రారంభం నాటికి ఇది పూర్తి కానుండగా.. అదే నెల చివర్లో తాప్సీ ఈ ఇంటిలోకి మారిపోనుందట.

ఇప్పుడు తాప్సీ ఏ ప్రాంతానికి వెళ్లినా.. కొత్తింటి కోసం ఇంటీరియర్స్ కొనుగోళ్లు చేసే పనిలో ఉందని తెలుస్తోంది. కొత్తింటి డిజైన్ ఎలా ఉంటుందో అమ్మడి మైండ్ లో ఓ క్లియర్ పిక్చర్ ఉండేసరికి.. దానికి తగినట్లుగా తెగ షాపింగ్ చేసేస్తోందని చెబుతున్నారు. షూటింగ్ లు.. వెకేషన్ లు.. ఇలా ఏ సందర్భంతో బయటకు వెళ్లినా పెద్దింటి కోసం షాపింగ్ చేసేస్తోందట తాప్సీ.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/