Begin typing your search above and press return to search.

# అథ్లెట్ తాప్సీ.. ఈ క‌ష్టం పగోడికైనా రాకూడ‌దు!

By:  Tupaki Desk   |   16 Dec 2020 1:48 PM IST
# అథ్లెట్ తాప్సీ.. ఈ క‌ష్టం పగోడికైనా రాకూడ‌దు!
X
సౌత్ నుంచి వెళ్లి ఉత్త‌రాదిన స‌త్తా చాటిన తాప్సీ వ‌ర‌స విజ‌యాల‌తో డేరింగ్ స్క్రిప్ట్ సెలెక్ష‌న్ తో అంత‌కంత‌కు హీట్ పెంచేస్తోంది. ఇంత‌కుముందు పింక్ - నామ్ ష‌బానా- మ‌న్మార్జియాన్ లాంటి విల‌క్ష‌ణ సినిమాల్లో త‌న‌దైన న‌ట‌న‌తో మెప్పించిన తాప్సీ ప్ర‌స్తుతం వ‌రుస‌గా అథ్లెట్ కాన్సెప్టుల్లో న‌టిస్తూ బిజీగా ఉంది.

తాప్సీ ప్ర‌స్తుతం `రష్మి రాకెట్`‌లో అథ్లెట్ పాత్రలో నటిస్తోంది. ఈ చిత్రం సెట్స్‌లో చేరడానికి ముందే ఎంతో కఠినంగా శిక్షణ తీసుకుంది. తాజాగా ఒక చిన్న వీడియో బైట్ ని రివీల్ చేసిన తాప్సీ త‌న హార్డ్ వ‌ర్క్ త‌ప‌న‌ను వ్య‌క్తీక‌రించింది.

తనను తాను అథ్లెట్ ‌గా మార్చుకునే ప్ర‌య‌త్నంలో తాప్సీ ఎంత‌గా శ్ర‌మిస్తోందో ఈ వీడియో బ‌య‌ట‌పెట్టింది. `ఇది చాలా కఠినమైనది` అంటూ తాప్సీ ఎంతో నిరాశ‌ప‌డినా అలుపెర‌గ‌క పోరాటం సాగించిన తీరు ఆస‌క్తిని క‌లిగించింది. యువ‌త‌రంలో స్ఫూర్తిని నింపేంత క‌ఠోరంగా తాప్సీ శ్ర‌మిస్తున్న తీరు ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. ఒక్కోసారి క‌ష్టం అవ్వ‌డంతో షూట్ నిలిపేసామని కూడా తాప్సీ తెలిపింది.

ర‌ష్మీ రాకెట్ కోసం క‌ఠోర‌మైన శిక్ష‌ణ‌కు సంబంధించిన వీడియోల్ని తాప్సీ స్వ‌యంగా ఇన్ స్టాలో షేర్ చేయ‌గా అవి సంచ‌ల‌నంగా మారాయి. రష్మి రాకెట్ కి ఆకర్ష్ ఖురానా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. నవంబర్లో పూణేలో సినిమా ప్రారంభమైంది. ఆర్.‌ఎస్.‌విపి మూవీస్ సంస్థ నిర్మిస్తోంది.

రష్మి రాకెట్ వచ్చే ఏడాది విడుదల అవుతుంది. భారతీయ స్టార్ మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్ పాత్రలోనూ తాప్సీ న‌టించ‌నుంది. త్వరలోనే ఈ మూవీ కూడా ప‌ట్టాలెక్క‌నుంది.