Begin typing your search above and press return to search.

వరుణ్‌ తో 'హలో బ్రదర్' అంటున్న తాప్సీ

By:  Tupaki Desk   |   21 Nov 2016 4:00 AM IST
వరుణ్‌ తో హలో బ్రదర్ అంటున్న తాప్సీ
X
ఇప్పుడు ఒక యంగ్ హీరో.. సౌత్ నుండి వచ్చిన యంగ్ హీరోయిన్లతో ఖచ్చితంగా పనిచేయాలనే పనిలో పడినట్లు ఉన్నాడు. ఆల్రెడీ ఇక్క దుమ్ములేపిన ఇలియానాతో ఒకసారి పనిచేశాడు. తరువాత మహేష్‌ సరసన అలరించి నాగ చైతన్యతో కూడా ఫ్లాపునే కొట్టిన కృతి సనన్ తో కూడా పనిచేశాడు. ఇప్పుడిక ముచ్చటగా మూడోసారి అన్నచందాన రింగులు జుత్తు బ్యూటి మన తాప్సీను ఎంచుకున్నాడట.

ఆ హీరో ఎవరోకాదండోయ్.. హ్యాండ్సమ్ బాబు వరుణ్‌ దావన్. వరుసపెట్టి కాస్త మంచి సినిమాలను చేస్తున్న తరుణంలో ఈ మధ్యనే రెండు మూడు ఫ్లాపులు తినేశాడు. ఆ కాజాలు ఎలా ఉన్నా కూడా.. మనోడు ఇప్పుడు కిక్ సినిమాతో డైరక్టర్ అవతారం ఎత్తిన ప్రొడ్యూసర్ సాజిద్ నదియాద్వాలా డైరక్షన్లో గతంలో సల్మాన్ ఖాన్ చేసిన ''జుడ్వా''ను రీమేక్ చేస్తున్నాడట. అదేనండీ.. తెలుగులో నాగార్జున చేసిన 'హలో బ్రదర్' సినిమా ఉందే.. అదే ఈ జుడ్వా సినిమా. ఇప్పుడు ఆ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉంటారుగా.. అందులో ఒక పాత్రను పెళ్ళయిన సాజిద్ గాళ్‌ ఫ్రెండ్ అనిపించుకుంటున్న జాక్వెలైన్ ఫెర్నాండజ్ చేస్తుంటే.. మరో రోల్ ను తాప్సీ చేస్తోంది.

ఈ మధ్యన పింక్ సినిమాతో పేరును కొట్టేసి నామ్ షబానా అంటూ మరో మల్టీప్లెక్స్ సినిమాను చేస్తున్న తాప్సీ.. ఈ సినిమాతో కమర్షియల్ బ్రేక్ సంపాదించాలని చూస్తోంది. మరి ఇలియానా.. కృతి.. వంటి సౌత్ తో పరిచయమన స్టార్లకు ఇవ్వలేని బ్రేకును తాప్సీకి ఇస్తావా వరుణ్‌?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/