Begin typing your search above and press return to search.

తాప్సి డ్రీమ్ రోల్.. అంతకుమించి ఉండాలట

By:  Tupaki Desk   |   12 July 2022 11:30 PM GMT
తాప్సి డ్రీమ్ రోల్.. అంతకుమించి ఉండాలట
X
'సూర్మా', 'సాంద్ కి ఆంఖ్' 'రష్మీ రాకెట్' ఇలా విభిన్నమైన స్పోర్ట్స్ తరహా సినిమాలతో నటి తాప్సీ పన్ను మంచి క్రేజ్ అయితే అందుకుంది. ఇప్పుడు ఆమె నుంచి 'శభాష్ మిథు' అనే మరో స్పోర్ట్స్ సినిమా రానుంది. అంతర్జాతీయ మహిళా క్రికెట్ ప్రపంచంలో అత్యధిక పరుగులు చేసినటువంటి మిథాలీ రాజ్ జీవిత ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు అయితే గట్టిగానే ఉన్నాయి. ఈ సినిమా కోసం తాప్సి ప్రత్యేకంగా కొన్ని నెలల వరకు క్రికెట్ ఆటపై ప్రత్యేకంగా శిక్షణ కూడా తీసుకుంది.

తాప్సి కొన్నాళ్లపాటు మిథాలి రాజ్ టెజో వ్యక్తిగతంగా ప్రయాణించి ఎన్నో విషయాలపై అవగాహన చేసుకుని ఈ సినిమాలో నటించడం జరిగిందట. ఎంతో చాలెంజింగ్ గా చేసిన ఈ పాత్ర తప్పకుండా వర్కౌట్ అవుతుంది అని ఆమె చాలా కాన్ఫిడెంట్ గా ఉంది.

బాలీవుడ్ లో తాప్సి సెలక్ట్ చేసుకుంటున్నా సినిమాలు హాట్ టాపిక్ గా నిలుస్తున్నాయి అని చెప్పాలి. వీలైనంతవరకు ఆమె విభిన్నమైన కథలను సెలెక్ట్ చేసుకుంటూ తన మార్కెట్ను కూడా పెంచుకునే ప్రయత్నం చేస్తుంది.

అయితే భవిష్యత్తులో మాత్రం తాప్సికి ఒక డ్రీమ్ రోల్ చేయాలని ఉన్నట్లు ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలియజేసింది. అవెంజర్స్ తరహాలో ఏదైనా పవర్ ఫుల్ క్యారెక్టర్ చేయాలని ఉన్నట్లు తాప్సి తన మనసులోని మాటను బయటపెట్టింది.

అయితే ఇంతవరకు అలాంటి పవర్ఫుల్ శక్తులు ఉన్న పాత్ర ఎవరు చేసి ఉండకూడదు అని అది పూర్తిగా చాలా కొత్తగా ఉండాలి అని అలాగే ఇండియా నేటివిటికి తగ్గట్లుగానే స్ఫూర్తినిచ్చే విధంగా ఉండాలి అని తాప్సీ మరొక ముఖ్యమైన విషయాన్ని తెలియజేసింది.

ప్రస్తుతం తాప్సికి బాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి మంచి ఆఫర్లు అయితే వస్తున్నాయి అయితే ఆమె మాత్రం తొందరపడకుండా మంచి కంటెంట్ ఉన్న కథలను ఎక్కువగా సెలెక్ట్ చేసుకుంటుంది. ముఖ్యంగా లేడీ ఓరియంటెడ్ సినిమాలో చేసేందుకు ఎంతో ఆసక్తిని చూపిస్తున్న తాప్సి ఇప్పుడు మిథాలీ రాజ్ బయోపిక్ తో ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో చూడాలి.