Begin typing your search above and press return to search.
డ్యాన్స్ భంగిమల పేరు చెప్పి వేధించాడట!
By: Tupaki Desk | 25 Sept 2018 6:15 PM IST2004 లో ఫెమినా మిస్ ఇండియా యునివర్స్ అయిన తనుశ్రీ దత్తా బాలీవుడ్ లో కూడా చాలా సినిమాల్లో నటించింది. ఇక తెలుగులో బాలయ్య సరసన 'వీరభద్ర'(2005) అనే సినిమాలో కూడా నటించింది. దాదాపు ఏడెనిమిదేళ్ళ నుండి సినిమాల్లో నటించడం లేదు. రీసెంట్ గా మీడియా ముందుకు వచ్చిన ఈ బాలీవుడ్ హీరోయిన్ అసలు గుర్తుపట్టలేనంతగా లావుగా మారింది.
తనకు గతంలో ఎదురైన వేధింపులపై పెదవి విప్పింది. సినిమా ఇండస్ట్రీలో వేధింపులు నిజమేనని అందులో దాచిపెట్టాల్సిన విషయం ఏమీ లేదని చెప్పండి. తనకు కూడా అలాంటి వేధింపులు ఎదురయ్యాయని.. 2008 లో ఒక సినిమా షూటింగ్ సమయంలో సహనటుడు డ్యాన్స్ భంగిమలు నేర్పిస్తానని తనతో అసభ్యంగా ప్రవర్తించాడని తెలిపింది. ఇక ఆ నటుడి పేరు మాత్రం వెల్లడించలేదు. తను మాత్రమే కాదు ఇండస్ట్రీ చాలామంది హీరోయిన్లకు ఇలాంటి పరిస్థితే ఉందని చెప్పింది.
ఎవరైనా ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నా వాళ్ళు బయటకు చెప్పలేరని.. అందుకే ఇలాంటి సంఘటనలు బయటకు రావని తెలిపింది. క్యాస్టింగ్ కోచ్ లాగానే ఈ వేధింపులు కూడా చాలా కామన్ అన్నమాట.. ఈ ప్రపంచంలో మంచోళ్ళ కంటే వెధవల పర్సెంటేజ్ బాగా ఎక్కువగా ఉన్నట్టుంది !