Begin typing your search above and press return to search.

ఆ ద‌ర్శ‌కుడు న‌గ్నంగా డ్యాన్స్ చేయ‌మన్నాడు!

By:  Tupaki Desk   |   28 Sep 2018 12:00 PM GMT
ఆ ద‌ర్శ‌కుడు న‌గ్నంగా డ్యాన్స్ చేయ‌మన్నాడు!
X
బాలీవుడ్ లో క్యాస్టింగ్ కౌచ్ ఉందంటూ....న‌టి త‌నూశ్రీ ద‌త్తా...సంచ‌ల‌న వ్యాఖ్య‌ల‌తో వార్త‌ల్లో నిలిచిన సంగ‌తి తెలిసిందే. విల‌క్ష‌ణ న‌టుడు నానా పాటేక‌ర్ త‌న‌ను డ్యాన్స్ పేరుతో త‌న‌ను అస‌భ్య‌క‌రంగా తాకాడ‌ని త‌నూ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఓ పాట సంద‌ర్భంగా త‌న‌కు ఈ చేదు అనుభ‌వం ఎదురైంద‌ని చెప్పింది. అయితే, ఆ వ్యాఖ్య‌ల‌ను నానా ప‌టేక‌ర్ ఖండించారు. దాంతో పాటు ఆ పాట చిత్రీక‌రించిన డ్యాన్స్ మాస్ట‌ర్ గ‌ణేశ్ ఆచార్య కూడా త‌నూ వ్యాఖ్య‌లు స‌రికాద‌ని...నానా ప‌టేక‌ర్ అలా చేయ‌లేద‌ని చెప్పాడు. వారిద్ద‌రికీ ఏదో విషయంలో విభేదాలు వ‌చ్చాయ‌ని, దీంతో, ఆ పాట నుంచి త‌నూను త‌ప్పించి రాఖీ సావంత్ ను ఎంపిక చేశార‌ని చెప్పాడు. ఈ నేప‌థ్యంలో త‌నూకు ప‌లువురు బాలీవుడ్ తార‌లు మ‌ద్ద‌తిచ్చారు. తాజాగా, మ‌రో ద‌ర్శ‌కుడిపై త‌నూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది.

ఓ సినిమా షూటింగ్ సందర్భంగా బాలీవుడ్ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి తనపట్ల అమర్యాదకరంగా ప్రవర్తించాడనీ, లైంగికంగా వేధించాడని త‌నూ ఆరోపించింది.‘చాకొలెట్‌: డీప్‌ డార్క్‌ సీక్రెట్స్‌’ సినిమా షూటింగ్ లో తనతో వివేక్ అసభ్యంగా ప్రవర్తించాడని తనూశ్రీ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఆ చిత్రం కోసం ఓ పాట షూటింగ్ సందర్భంగా దుస్తులు విప్పి త‌న‌ను డ్యాన్స్ చేయాల్సిందిగా వివేక్ వేధించాడని ఆరోపించింది. అయితే, ఆ స‌మ‌యంలో అక్కడే ఉన్న సునీల్ శెట్టి - ఇర్ఫాన్ ఖాన్ లు తనను కాపాడార‌ని తెలిపింది. వివేక్ పై వారిద్దరూ ఆగ్రహం వ్యక్తం చేయ‌డంతో అత‌డు వెన‌క్కు త‌గ్గాడ‌ని చెప్పింది. ఇప్ప‌టికే త‌నూకు బాలీవుడ్ ప్ర‌ముఖులు ఫర్హాన్ అక్తర్ - ప్రియాంక చోప్రా - రిచా చద్దా - ట్వింకిల్ ఖన్నాలు మద్దతుగా నిలిచారు. తాజాగా, వివేక్ పై త‌నూ చేసిన వ్యాఖ్య‌లు బాలీవుడ్ లో ప్ర‌కంప‌న‌లు రేపుతున్నాయి.