Begin typing your search above and press return to search.

ఆమెకు న్యాయం చేస్తానన్నోడూ కామాంధుడేనట

By:  Tupaki Desk   |   4 Jan 2020 11:06 AM IST
ఆమెకు న్యాయం చేస్తానన్నోడూ కామాంధుడేనట
X
నానా పటేకర్‌ పై లైంగిక వేదింపుల ఆరోపణలు చేసిన తనూశ్రీ దత్తా ఇండియాలో మీటూ ఉద్యమంకు ఆధ్యురాలు అనడంలో ఎలాంటి సందేహం లేదు. లైంగికంగా తనను నానా పటేకర్‌ వేదించాడు అంటూ తనూశ్రీ దత్తా మీడియా ముందుకు వచ్చి చెప్పడంతో పాటు కోర్టులో కేసు కూడా వేసింది. తనూశ్రీ దత్తా వేసిన కేసు తో పాటు నానా పటేకర్‌ కూడా తనూశ్రీ దత్తా పై కేసు వేశాడు. ఈ రెండు కేసులను తనూశ్రీ దత్తా తరపున నితిన్‌ సత్పుటే అనే లాయర్‌ వాదిస్తున్నాడు.

గత సంవత్సర కాలంగా తనూశ్రీ దత్తా తరపున లైంగిక వేదింపులకు వ్యతిరేకంగా ఆయన వాదిస్తూ వస్తున్నాడు. ఆడవారిపై జరుగుతున్న లైంగిక వేదింపులు తగ్గాలంటూ కోర్టు లో తన వాదనలు వినిపిస్తున్న నితిన్‌ సత్పుటే ఒక కామాంధుడు అంటూ ఒక మహిళ లాయర్‌ కేసు నమోదు చేసింది. తనను నితిన్‌ వేదించాడు అంటూ ఆమె మీడియా ముందుకు వచ్చి ఆరోపించింది. అదే సమయం లో అతడి పై కేసు కూడా పెట్టింది.

ఒక భూ వివాదంలో నితిన్‌ సత్పుటే కేసు వాదిస్తున్నాడు. ఆ వివాదంను రాజీ కుదిర్చేందుకు అవతలి వర్గం వారి లాయర్‌ తో భేటీ అయ్యాడు. ఆమె ఈ లేడీ లాయర్‌. రాజీ గురించి మాట్లాడే సమయంలో నితిన్‌ సత్పుటే మాట తీరు ఆమెకు అస్సలు నచ్చలేదట. మహిళలను కించ పర్చేవిధంగా మాట్లాడటంతో పాటు తనను లైంగికం గా వేదించే విధంగా మాట్లాడాడు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. నితిన్‌ సత్పుటేపై కేసు నమోదు అవ్వడంతో తనూశ్రీ దత్తా ఏం చేయబోతుందా అంటూ అంతా ఆసక్తి గా ఎదురు చూస్తున్నారు.