Begin typing your search above and press return to search.

రానా హీరోయిన్ పెండెంట్ క‌థాక‌మామీషు!

By:  Tupaki Desk   |   23 May 2021 3:30 AM GMT
రానా హీరోయిన్ పెండెంట్ క‌థాక‌మామీషు!
X
బాలీవుడ్ వాట‌ర్ బేబీ త‌నీషా ముఖ‌ర్జీ ఇటీవ‌లే అర‌ణ్య చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌య‌మైంది. దుర‌దృష్ట‌వ‌శాత్తూ తొలి ప్ర‌య‌త్నం ఆశించిన ఫ‌లితం అందుకోలేదు. రంగీలా ఊర్మిళ‌లా పెద్ద స్టార్ అవ్వాల‌ని క‌ల‌లు గ‌న్న ఈ బ్యూటీ కి ప్ర‌తిచోటా ఏదో ఒక అడ్డంకి ఎదుర‌వుతూనే ఉంది.

క‌ల‌లు క‌న‌డం వేరు.. వాటిని సాధించ‌గ‌ల‌గ‌డం వేరు! అని ప్రాక్టిక‌ల్ గా అర్థ‌మైంది. త‌నీషా ఇటీవ‌ల సోష‌ల్ మీడియాల్లో జ‌రంత స్పీడ్ గానే ఉన్నారు. ఫోటోలు వీడియోల రూపంలో షేర్ చేస్తుంటే అవి అభిమానుల్లో వైర‌ల్ అవుతున్నాయి. త‌నీషా షేర్ చేసిన ఓ ఫోటో ఇప్పుడు అభిమానుల్లో హాట్ టాపిక్ గా మారింది. ప‌సుపు రంగు ఫ్రాకు ధ‌రించిన ఈ బ్యూటీ ఎద అందాల్ని హైలైట్ చేస్తున్న ఆ గోల్డ్ పెండెంట్ ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచింది. అలా అందాల న‌డుమ అల్లాడుతున్న పెండెంట్ కథాక‌మామీషు ఏమిటో తెలుసుకోవాల‌ని యువ‌త ఆరాట‌ప‌డుతోంది. మ‌రి త‌నీషా దానికి సంబంధించిన క‌థ చెబుతుందేమో చూడాలి.

2003 చిత్రం ష్‌.. తో బాలీవుడ్ ‌లోకి అడుగు పెట్టిన ఈ బ్యూటీ తరువాత ఆమె పాప్ ‌కార్న్ ఖావో! మస్త్ హో జావో- టాంగో చార్లీ - నీల్ ఎన్ నిక్కి తదితర చిత్రాల్లో న‌టించారు. బిగ్ బాస్ 7 .. ఫియర్ ఫాక్టర్: ఖత్రోన్ కే ఖిలాడి 7 వంటి రియాలిటీ టీవీ షోలలో కూడా ఆమె పాల్గొంది. బండిష్- అనోఖా రిష్ట- జ్యువెల్ థీఫ్- జీన్ కి రాహ్- సుహాగన్- స్వర్గ్ నరక్ -అనుభవ్ వంటి క్లాసిక్స్ లోనూ న‌టించింది. తనీషా కాజోల్ కి సోద‌రి. తల్లి తనూజా ఒక ప్రముఖ నటి. ప్ర‌స్తుతం త‌నీషా సౌత్ లో వ‌రుస చిత్రాల్లో న‌టించేందుకు ప్లాన్ చేస్తున్నార‌ని స‌మాచారం.