Begin typing your search above and press return to search.

వీడియో: రానా హీరోయిన్ ని రంగీలా పూనిన‌ట్టుందే!

By:  Tupaki Desk   |   5 March 2021 4:30 PM GMT
వీడియో:  రానా హీరోయిన్ ని రంగీలా పూనిన‌ట్టుందే!
X
బాలీవుడ్ వాట‌ర్ బేబీగా త‌నీషా ముఖ‌ర్జీ సుపరిచితం. ఈ అమ్మ‌డికి నీళ్లు క‌నిపిస్తే చాలు పూన‌కం వ‌చ్చేస్తుంటుంది. బికినీ బీచ్ కి వెళ్లినా బులుగు స‌ముద్రం చూసినా ఇంక ఆప‌డం క‌ష్ట‌మే.

ఇదిగో ఇక్క‌డ త‌నీషా ఏం చేస్తోందో చూశారు క‌దా? బులుగు జిలుగు సముద్రం చెంత బీచ్ ఇసుక‌లో ఎలా మైమ‌రిచి డ్యాన్సులు చేస్తోందో! త‌న ఫేవ‌రెట్ రంగీలా సాంగ్ కి ఇలా ఇసుక‌లో చిందులేస్తోంది. యాయిరే యాయిరే .. ధూమ్మ‌చాలే! అంటూ రెడ్ హాట్ బికినీలో త‌నీషా నాటి ఊర్మిల మ్యాజిక్ ని రీక్రియేట్ చేసేందుకు ప్ర‌య‌త్నిస్తోంది.

రంగీలా సినిమాని ఎంతో ప్రేమించాను. ఇదిగో ఈ వైబ్స్ ని అమితంగా ఇష్ట‌ప‌డ్డాను. స‌ముద్ర ప‌రిస‌రాలు ఆ మూవ్ మెంట్ ని ఎంజాయ్ చేసేందుకు స్ఫూర్తినిస్తుంటాయి. ఊర్మిలా మిమ్మ‌ల్ని ఈ పాట‌లో ఎంతో ఇష్ట‌ప‌డ‌తాను. మీరు ఐకానిక్.. #రంగీలా అంటూ ఎంతో ఎమోష‌న‌ల్ గా వ్యాఖ్యానాన్ని జోడించింది ఈ వీడియోకి.

వాటర్ బేబీ తనీషా ముఖర్జీ తన సంతోషాన్ని మాట‌ల్లోనే కాదు ఫోటోలు వీడియోల రూపంలో షేర్ చేస్తుంటే అవి రానా అభిమానుల్లోనూ వైర‌ల్ అవుతున్నాయి. త‌నీషా ప్ర‌స్తుతం రానా స‌ర‌స‌న అర‌ణ్య చిత్రంలోనూ న‌టిస్తోంది. 2003 చిత్రం ష్‌.. తో బాలీవుడ్ ‌లోకి అడుగు పెట్టిన ఈ బ్యూటీ తరువాత ఆమె పాప్ ‌కార్న్ ఖావో! మస్త్ హో జావో- టాంగో చార్లీ - నీల్ ఎన్ నిక్కి తదితర చిత్రాల్లో న‌టించారు. బిగ్ బాస్ 7 .. ఫియర్ ఫాక్టర్: ఖత్రోన్ కే ఖిలాడి 7 వంటి రియాలిటీ టీవీ షోలలో కూడా ఆమె పాల్గొంది.

బండిష్- అనోఖా రిష్ట- జ్యువెల్ థీఫ్- జీన్ కి రాహ్- సుహాగన్- స్వర్గ్ నరక్ -అనుభవ్ వంటి క్లాసిక్స్ లోనూ న‌టించింది. తనీషా కాజోల్ కి సోద‌రి. తల్లి తనూజా ఒక ప్రముఖ నటి.