Begin typing your search above and press return to search.
ముమైత్ ను ఫాలో అయిన తనీశ్
By: Tupaki Desk | 31 July 2017 11:44 AM ISTడ్రగ్స్ విచారణ కేసులో మరో సినీ ప్రముఖుడు సిట్ అధికారుల ఎదుట హాజరయ్యారు. ఇప్పటికే తొమ్మిది మంది సినీ ప్రముఖుల్ని విచారించిన సిట్ అధికారులు ఈ రోజు యువహీరో తనీశ్‌ను విచారించనున్నారు. ఉదయం పది గంటలకు అబార్కీ కార్యాలయానికి హాజరు కావాలంటూ నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో.. విచారణ సమయానికి పది నిమిషాల ముందు అబార్కీ కార్యాలయానికి హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన ముమైత్‌ను ఫాలో అయినట్లుగా కనిపించింది. బ్లాక్ డ్రెస్ లో ముమైత్ విచారణకు వచ్చారు. తనీశ్ బ్లాక్ షర్ట్ వేసుకోవటంతో పాటు.. కాస్తంత సీరియస్ గా.. హీరోయిక్ స్టైల్లో కారులో నుంచి దిగటం కనిపించింది.
కారులో నుంచి దిగిన తనీశ్ తో పాటు.. మరో ఇద్దరు వెంట ఉండగా.. కార్యాలయంలోకి తనీశ్ తో పాటు ఒకరిని అనుమతించారు. సదరు వ్యక్తి సిట్ అధికారిగా భావిస్తున్నారు. లోపలకు వెళ్లే సమయంలో తనీశ్ కాస్త ఆగి.. వెనక్కి చూడటం కొద్ది క్షణాలు అక్కడే ఉండి లోపలకు వెళ్లటం కనిపించింది.
విచారణకు హాజరైన ముమైత్ ఖాన్ ఫుల్ గా మేకప్ వేసుకొని.. ఒక ఆఫీసర్ మాదిరి విచారణకు వెళ్లారన్న మాట ఉంది. తనీశ్ తీరు అలానే సాగిందన్న అభిప్రాయం పలువురి నోట వినిపించింది. డ్రగ్స్ కేసులో విచారణలో భాగంగా ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కెల్విన్.. జాక్ లు తనీశ్‌కు డ్రగ్స్ సరఫరా చేసినట్లుగా చెప్పటంతోనే ఆయనకు నోటీసులు ఇచ్చినట్లుగా చెబుతున్నారు. మరి.. తనీశ్ విచారణ ఏ విధంగా సాగనుంది? అధికారుల ప్రశ్నలకు తనీశ్ ఏ తీరులో సమాధానాలు ఇస్తారన్నది బయటకు రావాల్సి ఉంది