Begin typing your search above and press return to search.

పద్మశ్రీ ఇస్తే తీసుకోనంటూ తనికెళ్ల సంచలనం

By:  Tupaki Desk   |   20 Jun 2016 12:51 PM IST
పద్మశ్రీ ఇస్తే తీసుకోనంటూ తనికెళ్ల సంచలనం
X
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రతిభతో పైకి వచ్చిన కొద్ది మందిలో తనికెళ్ల భరణి ఒకరు. రచయితగా.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఆయన తెలుగు సినీ ప్రేక్షకుల మదిలో తనదైన ముద్ర వేశారు. వివాదాలకు వీలైనంత దూరంతో ఉంటూ.. అందరితో కలుపుగోలుగా ఉండే ఆయన తాజాగా సంచలన వ్యాఖ్య ఒకటి చేశారు. ఎందరో కలలు కనే పద్మశ్రీ అవార్డు గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.

తనకు భవిష్యత్తులో పద్మశ్రీ అవార్డు వచ్చినా తాను స్వీకరించనని చెప్పిన ఆయన ఎందుకలా అన్న విషయాన్ని కూడా స్పష్టత ఇచ్చేశారు. తెలుగు సినిమా పరిశ్రమలో ఎస్వీ రంగారావు.. సావిత్రి.. సూర్యకాంతం వంటి మహానటులకు దక్కని పద్మశ్రీ సత్కారం తనకు వద్దని.. ఒకవేళ ఇచ్చినా తాను తీసుకోనని చెప్పేశారు. తనికెళ్ల భరణి లాజిక్ ఏదో బాగున్నట్లే కనిపిస్తోంది కదూ..?