Begin typing your search above and press return to search.

తంగ‌ళాన్ గ్లింప్స్: చియాన్ విక్రమ్ 61 భారీ ప్ర‌యోగం?

By:  Tupaki Desk   |   24 Oct 2022 4:04 AM GMT
తంగ‌ళాన్ గ్లింప్స్: చియాన్ విక్రమ్ 61 భారీ ప్ర‌యోగం?
X
చియాన్ విక్రమ్ ఒక పాత్ర‌ను ఎంపిక చేసాడంటే అది చాలా స్పెష‌ల్ గా ఉంటుంద‌న్న‌ది చెప్పాల్సిన ప‌ని లేదు. ఇంత‌కుముందు ఫేవ‌రెట్ బాలా ద‌ర్శ‌క‌త్వంలో శివ‌పుత్రుడు లో అత‌డి న‌ట‌న‌కు ప్ర‌జ‌లు జేజేలు ప‌లికారు. మూగ‌బ‌ధిరుడిగా విక్రమ్ ఆహార్యం ఇప్ప‌టికీ క‌ళ్ల ముందు క‌నిపిస్తుంది. ఆ త‌ర్వాత విక్ర‌మ్ ఫాలోయింగ్ గురించి తెలిసిందే. శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలోని అప‌రిచితుడులో రామ్ గా రెమోగా.. 'ఐ' సినిమాలో బీస్ట్ గా కురూపిగా అత‌డి ట్రాన్స్ ఫ‌ర్మేష‌న్ యాక్ష‌న్ చూశాక వ్వావ్ అన‌కుండా ఉండ‌లేం.

విక్ర‌మ్ ఇలాంటి ప్ర‌యోగాలెన్నో చేస్తూనే ఉన్నారు. జ‌యాప‌జ‌యాల‌తో సంబంధంల లేకుండా అత‌డితో సినిమాలు చేసేందుకు నిర్మాత‌లు ఎప్పుడూ ఆస‌క్తిగా ఉంటారు. విక్రమ్ త‌న కెరీర్ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ గా ప్ర‌చార‌ముతున్న చియాన్ 61 నుంచి తాజాగా కొన్ని సెక‌న్ల నిడివితో గ్లింప్స్ రిలీజైంది.

ఈ వీడియో ఆద్యంతం ఆస‌క్తిని రేకెత్తించింది. చియాన్ విక్ర‌మ్ మ‌రోసారి ఒక విభిన్న‌మైన గెట‌ప్ తో క‌నిపించ‌నున్నాడు. 70లు 80ల కాలంలో గిరిజ‌నుల సంస్కృతిని తెర‌పైకి తెస్తున్నార‌ని కూడా ఈ గ్లింప్స్ లో అర్థ‌మ‌వుతోంది. విక్ర‌మ్ కొన్ని పూరి పాక‌లు ప్ర‌జ‌ల న‌డుమ నాయ‌కుడిలా క‌నిపిస్తున్నాడు. అత‌డి చేతిక‌ర్ర విచిత్రంగా ఉంది. ఒక పీరియాడికల్ యాక్షన్ డ్రామా ఇద‌ని అర్థ‌మ‌వుతోంది. విక్రమ్ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా ఇది.

నిజ ఘ‌ట‌న‌ల‌తో తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రం అధికారిక టైటిల్ ను ఈరోజు 'తంగళాన్' అని వెల్లడించారు. అలాగే విక్రమ్ కొత్త ఆహార్యంతో వైల్డ్ అవతార్ లో అద్భుతంగా కనిపిస్తున్నాడు. అలాగే ఈ చిన్న వీడియోలో మాళవిక మోహనన్ మెరుపులు ఆక‌ట్టుకున్నాయి.

ఇందులో మ‌రోసారి విక్రమ్‌ను బీస్ట్ మోడ్ లో చూడ‌బోతున్నామ‌ని అర్థ‌మ‌వుతోంది. ప్రముఖ స్టూడియో గ్రీన్ బ్యానర్ - నీలం ప్రొడక్షన్స్ తో కలిసి ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మిస్తోంది. జీవీ ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఇది బహుభాషా చిత్రం. తెలుగు-త‌మిళం-హిందీలో ప్ర‌ధానంగా విడుద‌ల కానుంద‌ని స‌మాచారం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.