Begin typing your search above and press return to search.

హీరో నిఖిల్ పై తమ్మారెడ్డి షాకింగ్ కామెంట్స్..!?

By:  Tupaki Desk   |   1 Sep 2022 10:30 AM GMT
హీరో నిఖిల్ పై తమ్మారెడ్డి షాకింగ్ కామెంట్స్..!?
X
యువ హీరో నిఖిల్ మరియు డైరెక్టర్ చందు మొండేటి కాంబినేషన్ లో తెరకెక్కిన "కార్తికేయ 2" సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా 100 కోట్లకు పైగా వసూళ్లతో దూసుకుపోతోంది. ముఖ్యంగా నార్త్ మార్కెట్ లో ఈ మిస్టికల్ అడ్వెంచర్ థ్రిల్లర్ గట్టి ప్రభావం చూపిస్తోంది. అన్ని వర్గాల ప్రేక్షకులు మరియు సినీ ప్రముఖుల నుంచి ఈ చిత్రానికి ప్రశంసలు దక్కుతున్నాయి.

నిజానికి 'కార్తికేయ 2' సినిమా విడుదల అంత సాఫీగా ఏం జరగలేదు. అనేకసార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ చిత్రానికి రిలీజ్ డేట్ విషయంలో సమస్యలు వచ్చాయి. ముందుగా అనుకున్న తేదీ నుంచి వెళ్ళిపొమ్మన్నారని.. ఇప్పట్లో థియేటర్లు దొరకవని హెచ్చరించారని హీరో నిఖిల్ ఓ ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం వెనుక దిల్ రాజు ఉన్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. ఇదే విషయం మీద తాజాగా ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పందించారు.

'కార్తికేయ 2' సినిమాకి సరైన స్థానం ఇవ్వలేదని.. రిలీజ్ కు థియేటర్లు ఇవ్వలేదనే దానిపై తమ్మారెడ్డి మాట్లాడుతూ.. అసలు థియేటర్స్ విషయంలో అడగడానికి హీరో నిఖిల్ కి ఏం సంబంధం? అని ప్రశ్నించారు. ఏ నిర్మాత అయినా అందుబాటులో ఉన్న థియేటర్లను బట్టి సినిమాని రిలీజ్ ప్లాన్ చేసుకుంటాడని.. గట్స్ ఉండే దొరికిన థియేటర్లలోనే మరో సినిమాకు పోటీగా రిలీజ్ చేసుకుంటాడని అన్నారు.

'కార్తికేయ 2' చిత్రాన్ని 'మాచర్ల నియోజకవర్గం' మీద వేశారు. ఒకవేళ దిల్ రాజు గారు అడ్డుకున్నారు అనుకుంటే.. మీకు గట్స్ ఉంటే ఇదేదో అప్పుడే 'థాంక్యు' సినిమా మీద రిలీజ్ చేసి ఉండొచ్చు కదా?. అప్పుడు థియేటర్లు తక్కువ ఉన్నాయి అన్నారు.. ఇప్పుడు కూడా తక్కువ థియేటర్లలోనే రిలీజ్ అయింది. సినిమా హిట్ అయింది కాబట్టి.. ఎక్కువ థియేటర్లు ఇచ్చారు. ఆ రోజు థాంక్యూ మీద రిలీజ్ చేసినా ఇదే జరిగేది. కానీ ఆరోజు మీకు గట్స్ లేవు అని తమ్మారెడ్డి తెలిపారు.

'మాచర్ల నియోజకవర్గం' అప్పుడు ధైర్యంగా రిలీజ్ చేశావ్.. అప్పుడు ఎందుకు భయపడి వెనక్కి తగ్గావ్? అని ఆయన ప్రశ్నించారు. మన సినిమా మీద నమ్మకం ఉంటే థియేటర్లు ఎక్కువ వస్తే బాగుంటుంది అనుకున్నారు కాబట్టి తర్వాత వస్తామని అనుకోవడంలో తప్పులేదు.. అంతేకానీ వాడు వీడు దుర్మార్గం చేశాడు అని అనుకోవడం ఎందుకు? అసలు మ్యుచవల్ గా అనుకున్న విషయాలు బయటకు చెప్పకూడదు అని తమ్మారెడ్డి అన్నారు.

"ఇన్ని మాటలు అన్న తర్వాత అదే దిల్ రాజు ని సక్సెస్ మీట్ కి తీసుకొచ్చి మాట్లాడించారు. వీళ్లంతా మా ఇంటికి వచ్చి అడిగారు అని జరిగిందంతా దిల్ రాజు చెప్తున్నప్పుడు.. మైక్ తీసుకొని ఇదంతా అబద్ధం.. ఆయన దుర్మార్గుడు అని అనలేదుగా?. అప్పుడు ఎందుకు మాట్లాడలేదు?. ఇక్కడ నేనూ ఎవరిది తప్పు అనేది చెప్పడం లేదు. దిల్ రాజు దుర్మార్గుడా మంచోడా అనేది నీకు అనవసరం. మీ ఇద్దరి మధ్య సమస్య మీడియా వరకు ఎందుకు రావాలి అని అంటున్నాను"

"మీ ఇద్దరి మధ్య సమస్య వస్తే ఎదురుపడి తేల్చుకోండి. కానీ మీడియాలో చెప్పి అతన్ని అన్ పాపులర్ చేశాడు. ఇప్పుడు లక్కీగా 'కార్తికేయ 2' హిట్ అయింది. ఒకవేళ ప్లాప్ అయ్యుంటే? అదొక లైగర్ అయ్యుంటే అప్పుడు ఆయన మాట్లాడతాడా? ఇండస్ట్రీలో ఏదైనా హెల్దీగా ఉండాలి. ఈ బ్లేమ్ గేమ్స్ ఉండకూడదు. సక్సెస్ వచ్చినప్పుడు కాలర్ ఎగరేయడం.. ఫెయిల్యూర్ వస్తే ఏడవడం.. కళ్ళలో నీళ్లు పెట్టుకోవడం.. మీడియాలో కూర్చొని ఈ డ్రామాలు చేయడం.. ఇవన్నీ చాలా అసహ్యకరమైన విషయాలు"

"ఇక్కడ అందరూ బిజినెస్ చేస్తారు. ఎవడైనా సినిమా తీసేది డబ్బులు సంపాదించడానికే.. దేశాన్ని ఉద్దరించడానికి కాదు. నేను నా పెళ్ళాం పిల్లలకు అన్నం లేకుండా చేశాను అని ఇక్కడ ఏడిస్తే ఏంటి?. నిన్ను ఎవరు సినిమా తీయమన్నారు? నీ కష్టంలో ఎవడైనా ఎందుకు రావాలి?. ఇక్కడ 95 శాతం సినిమాలు ప్లాప్ అవుతాయి.. కేవలం 50 శాతం మాత్రమే ఆడతాయి. ఆ 95 శాతంలో 75 శాతం మంది చాలా బ్యాడ్ స్టేజ్ కి వెళ్ళిపోతారు. డబ్బులు ఉన్నవారు ఏదొక విధంగా మ్యానేజ్ చేస్తారు.. మిగిలిన వాళ్ళు ఫుడ్ కూడా ఇబ్బంది పడతారు"

"ఇవాళ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ నుంచి వెయ్యి రూపాయలు పెన్షన్ తీసుకునే పరిస్థితుల్లో ఉన్న నిర్మాతలు కూడా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉంటే మనం దేని గురించి మాట్లాడుతున్నాం. నీకు ఇష్టమై సినిమా తీస్తున్నావు. సహాయం చేసేవాళ్ళు ఉంటే చేస్తారు.. లేకపోతే లేదు. అంతేకానీ నాకు సాయం చేయలేదు.. నేను అన్యాయం అయిపోయాను. నేను కష్టంలో ఉంటే ఆదుకోడానికి ఎవరూ రాలేదు అని అనడం కరెక్ట్ కాదు"

"సినిమాని ఎవరూ అడ్డుకోరు. నీకు గట్స్ ఉంటే రిలీజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు రిలీజ్ చేశావ్ కదా? (కార్తికేయ 2 ని ఉద్దేశించి). ఏ సినిమాకైనా సరైన రిలీజ్ డేట్ దొరకనే దొరకదు. ఎందుకంటే ఎప్పుడూ ఏదొక పెద్ద సినిమా ఉంటూనే ఉంటుంది. 'మాచర్ల నియోజకవర్గం' సినిమాపై రిలీజ్ చేసినట్లు అప్పుడు 'థాంక్యూ' మీద ఎందుకు చేయలేదు? దిల్ రాజు మాట్లాడుతున్నప్పుడు ఇది తప్పు అని ఎందుకు ఖండించలేదు?"

"ఇవన్నీ అనవసరమైనవి.. సిల్లీ విషయాలు మాట్లాడుకోవడం తప్పు. ఇవాళ సినిమా సక్సెస్ అయింది.. ఒక చిన్న సినిమా సక్సెస్ అయినందుకు అందరం హ్యాపీగా ఉన్నాం. పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయింది. తెలుగులో బాగా చేస్తోంది. హిందీలో ఊహించిన దానికంటే ఎక్కువ వసూలు చేస్తోంది. 'పుష్ప' మాదిరిగానే 'కార్తికేయ 2' కూడా సర్ప్రైజ్ చేసింది'' అని తమ్మారెడ్డి చెప్పుకొచ్చారు.

ఇంకా ఆయన మాట్లాడుతూ.. "సినిమా తీసే ముందు థియేటర్లు ఇస్తారా లేదా అని ఆలోచించుకోవాలి. ఇవ్వకపోతే తెల్చుకోవాలి.. దమ్ముంటే పొట్లాడాలి. అంతేకాని జనాల్లోకి వస్తే వారు థియేటర్లు ఇప్పిస్తారా? అసలు ప్రజలకు దీంట్లో సంబంధమేంటి? వాళ్ళకి మంచి కంటెంట్ ఉన్న సినిమా ఇస్తే చూస్తారు. యూట్యూబ్ లో ఇంత హడావుడి చేసే జనాలు సినిమా చూడటానికి ఎందుకు రారు? ఇవాళ పెద్ద పెద్ద హీరోలకు లక్షలు కోట్లల్లో ఫాలోవర్స్ ఉన్నారు. మరి ఓపెనింగ్స్ ఎందుకు రావడం లేదు?"

"పెద్ద హీరోల సినిమాలు కూడా మార్నింగ్ షోల నుంచే ఎందుకు అడ్రెస్ లేకుండా పోతున్నాయి? అందుకే ఇలాంటి సమస్యలు ప్రజల వద్దకు తీసుకెళ్ళాల్సిన అవసరం లేదు. 'మంచి సినిమా తీసాం.. థియేటర్ కు వచ్చి సినిమా చూడండి' అని అడిగితే చాలు. 'నేను అన్నం నిద్ర మానేసి సినిమా చేశాను.. నాకు డబ్బులు ఇవ్వలేదు.. నాకు థియేటర్లు ఇవ్వడం లేదు' అంటే.. ఇలాంటివి ఎవడికి కావాలి. ఇలాంటివి మాట్లాడటం వల్ల అనవసరంగా అవతలి వ్యక్తి మీద కోపాన్ని కలిగిస్తున్నాం. బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాం అంతే"

"ఏ హీరో అయినా సక్సెస్ లేనప్పుడు ఏడవక్కర్లేదు.. వచ్చినప్పుడు కాలర్ ఎగరయ్యక్కర్లేదు అనే నేను చెప్తాను. ఎవరినీ హేట్ చేయొద్దు. సక్సెస్ ని టాలెంట్ తో నిరూపించుకోవాలి. సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ ని ఆపలేరు.. ఎవడూ తొక్కలేడు. ఎవరు ఎవరిని హీరో చేయలేడు. చిరంజీవితో నేను అప్పట్లో కోతలరాయుడు సినిమా తీశా.. నేను కాకపోతే వేరే పుల్లయ్య చేసేవాడు.. కానీ ఆయనలో టాలెంట్ ఉంది కాబట్టే పెద్ద హీరో అయ్యాడు"

"ఇవాళ నిఖిల్ కి కార్తీకేయ తో హిట్ వచ్చింది.. అంతకు ముందు ఫ్లాప్స్ కూడా వచ్చాయి కదా.. ఇప్పుడు అన్నీ కుదిరాయి కాబట్టి హిట్ వచ్చింది. సక్సెస్ వచ్చినప్పుడు ఒకమాట.. ఫ్లాప్ వచ్చినప్పుడు మరో మాట మాట్లాడకూడదు. ముందు ఒకమాట.. వెనుక ఒక మాట ఉండకూడదు.. నీకు ఏదైనా ఉంటే ముందు మాట్లాడు. దిల్ రాజుని ఆరోజు ఎందుకు తిట్టలేదు?. నిజంగా నీకు దమ్ము ఉండి ఉంటే.. దిల్ రాజు సపోర్ట్ చేయడం లేదని ఆరోజు మైక్ లాక్కుని 'నా కొ*కా అలా చేయలేదు' అని అనొచ్చుగా"

"నువ్వు దిల్ రాజు ఇంటికి వెళ్లి అడుక్కున్నావ్.. ఆయన అది చెప్తున్నాడు. అది అబద్ధమా? నిజమా? అని స్టేజ్ పై ఉన్న నువ్వు చెప్పాలిగా?. అసలు నువ్ ఆయన ఇంటికి ఎందుకు వెళ్ళావ్? నీకేం అవసరం? అసలు సినిమా రిలీజ్ తో హీరోకి ఏం పని? నాకు థియేటర్స్ ఇవ్వడం లేదని హీరో ఎందుకు స్టేట్మెంట్ ఇచ్చాడు? నీకేం సంబంధం. నువ్ హీరోవి.. ప్రొడ్యూసర్ వి కాదు కదా? డబ్బులు తీసుకోకుండా నువ్వేం సినిమా చేయలేదు కదా? నువ్వు ఏదైనా చేస్తేనే ఇవాళ థియేటర్లు ఇచ్చారా? సినిమా అంత పెద్ద హిట్ అయింది కాబట్టి.. థియేటర్లో వేసుకుంటున్నారు. సక్సెస్ అనేది స్పీక్స్.. ఎవరైనా సరే ఎందుకు అనవసరంగా వాళ్ల మీద వీళ్ల మీద పడి ఏడ్వడం సరికాదు'' అని తమ్మారెడ్డి భరద్వాజ్ అన్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.