Begin typing your search above and press return to search.

స్వచ్ఛ్ విగ్రహాలు అంటున్న తమ్మారెడ్డి

By:  Tupaki Desk   |   21 March 2016 4:11 AM GMT
స్వచ్ఛ్ విగ్రహాలు అంటున్న తమ్మారెడ్డి
X
తమ్మారెడ్డి భరద్వాజ్ దర్శక నిర్మాతగానే కాకుండా.. మంచి వ్యక్తిగా సినిమా ప్రపంచానికి తెలుసు. ఎంతోమందికి మార్గదర్శకుడు కూడా ఆయన. తమ్మారెడ్డికి చిరస్థాయిగా నిలిచిపోయే ఎన్నెన్నో సినిమాలు తీసిన హిస్టరీ ఉంది. ఇప్పుడు మరో రకమైన సర్వీస్ తో అందరినీ ఆకట్టుకున్నారు ఆయన.

ఫిలింనగర్ లో చాలా ఏళ్ల క్రితం సినిమా రంగానికి సేవ చేసిన మహనీయుల విగ్రహాలను ప్రతిష్టించారు. చిత్తూరు నాగయ్య - సముద్రాల రాఘవాచార్య - రఘుపతి వెంకటరత్నం నాయుడు వంటి సినీ మహానుభావుల విగ్రహాలు ఉన్నా.. వాటిని ఎవరూ పట్టించుకున్న పాపాన పోవడం లేదు. అందుకే.. తనే ముందుకు కలిది.. ఆ మూడు విగ్రహాలను శుభ్రం చేశారు, చేయించారు తమ్మారెడ్డి. ప్రస్తుతం చెత్త కుండీల స్థాయిలో తయారైపోయిన విగ్ర పరిసర ప్రాంతాలను నీట్ గా మార్చారు.

ఇకపై కూడా ఈ విగ్రహాలను శుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సినిమా రంగాన్ని, తెలుగు ఫిలిం చాంబర్ ను, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ను కోరారు తమ్మారెడ్డి. ఇలా మహనీయులను ఎల్లప్పుడూ మదిలో మెదిలేలా చర్యలు తీసుకునేందుకు తమ్మారెడ్డి చేపట్టిన కార్యక్రమం అందరినీ ఆకట్టుకుంది.