Begin typing your search above and press return to search.

`కార్తికేయ 2` టీమ్ గ‌ర్వంగా ఫీల‌వ్వాలి : త‌మ్మారెడ్డి భ‌రద్వాజ‌

By:  Tupaki Desk   |   20 Aug 2022 12:31 PM GMT
`కార్తికేయ 2` టీమ్ గ‌ర్వంగా ఫీల‌వ్వాలి : త‌మ్మారెడ్డి భ‌రద్వాజ‌
X
యంగ్ హీరో నిఖిల్ న‌టించిన లేటెస్ట్ మూవీ `కార్తికేయ‌2`. సూప‌ర్ నేచుర‌ల్ మిస్టిక్ థ్రిల్ల‌ర్ గా తెర‌కెక్కిన ఈ మూవీని చందూ మొండేటి తెర‌కెక్కించారు. అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్‌, పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ బ్యాన‌ర్ ల‌పై అభిషేక్ అగ‌ర్వాల్‌, టి.జి. విశ్వ‌ప్ర‌సాద్ అత్యంత భారీ స్థాయిలో ఈ మూవీని నిర్మించారు. అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ హీరోయిన్ గా న‌టించింది. కృష్ణ‌త్వం నేప‌థ్యంలో రూపొందిన ఈ మూవీ ఆగ‌స్టు 13న ఎట్ట‌కేల‌కు ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది.

ఉభ‌య తెలుగు రాష్ట్రాల‌తో పాటు ఈ మూవీ ఉత్త‌రాదిలోనూ వ‌సూళ్ల వ‌ర్షం కురిపిస్తోంది. హిందీ బెల్ట్ లో ఈ మూవీ కి ముందు థియేట‌ర్లు పెద్ద‌గా లభించ‌క‌పోవ‌డంతో చాలా త‌క్కువ థియేట‌ర్ల‌లో విడుద‌ల చేశారు. ఆ త‌రువాత టాక్ స్ప్రెడ్ కావ‌డంతో ఇప్ప‌డు ఉత్త‌రాదిలో రికార్డు స్థాయిలో థియేట‌ర్లు పెరిగాయి. సినిమా కూడా బాగా న‌చ్చ‌డంతో ఉత్త‌రాది ప్రేక్ష‌కులు ఈ మూవీకి బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. దీంతో ఉత్త‌రాదిన ఈ మూవీకి క‌లెక్ష‌న్ ల వ‌ర్షం కురుస్తోంది.

ఇదిలా వుంటే ఈ మూవీ జూలై 22న ఒక‌సారి, ఆగ‌స్టు 12న మ‌రోసారి వాయిదా ప‌డ‌టం వివాదాస్ప‌దంగా మారిన విష‌యం తెలిసిందే. దీనిపై స్పందించిన హీరో నిఖిల్ కావాల‌నే నా సినిమాని వెనక్కి నెట్టారని, ఆ రోజు భావోద్వేగానికి లోనై ఏడ్చాన‌ని నిఖిల్ చెప్పుకొచ్చాడు. ఇండైరెక్ట్ గా కొంత మందిని ఉద్దేశిస్తూ కామెంట్ లు చేశారు. అయితే ఇప్ప‌డు తాను అలా అన‌లేద‌ని వివ‌ర‌ణ ఇచ్చారు. ఈ నేప‌థ్యంలో ఈ వివాదంపై త‌మ్మారెడ్డి భ‌రద్వాజ స్పందించారు.

నేను దాదాపుగా 40 సినిమాలు చేశాన‌ని, మ‌న సినిమా రిలీజ్ వున్న‌ప్పుడు ప‌క్క వాళ్ల‌ని అడుగుతుంటా.. ఈ వారం నువ్ ఆగ‌రాదు.. నెక్స్ట్ వీక్ నీ సినిమా రిలీజ్ చేసుకో అని అడుగుతాం. అవ‌తల వాళ్లు ఏమంటారు మీరే ఆగొచ్చుక‌దా అని అంటారు. ఇది ఎప్పుడూ ఉండేదే. ఈ రోజు కొత్త‌గా వ‌చ్చింది కాదు.

అలాగే దిల్ రాజు కూడా అడిగి ఉండొచ్చు. నిజంగా దిల్ రాజు లెవెల్ కి ఆయ‌న ఫోన్ చేసి`కార్తికేయ‌2` టీమ్ వాళ్ల‌ని అడిగాడంటే .. గర్వంగా ఫీల‌వ్వాలి. గ్యారంటీ హిట్ సినిమా అని ముందే ఊహించాడు. నిఖిల్ అంటే నాగ‌చైత‌న్య పెద్ద హీరో.. పెద్ద హీరో చేస్తున్న సినిమ ఆ కి పోటీగా భావించి సినిమా వాయిదా వేసుకోమ‌ని అడిగాడంటే ఎంత గొప్ప‌గా ఫీల‌వ్వాలి.

నిఖిల్ తెలివైన వాడే అయితే స‌రే అన్నా నీ కోసం ఆగుతా.. నెక్స్ట్ వీక్ నుంచి నాకు థియేట‌ర్స్ ఇవ్వు అని అడిగితే అక్క‌డే అయిపోయేది. దిల్ రాజు మీడియాని తిడుతున్న‌ప్పుడు నిఖిల్ మాట్లాడ‌కుండా వున్నాడంటే ..ఆయ‌న ఆ మాట అన‌లేద‌నుకోవాల‌న్న‌మాట‌. మీడియా వాళ్లే సృష్టించి ఉండొచ్చు. ఖ‌చ్చితంగా దిల్ రాజు ఫీలింగ్ ఏంటంటే.. `కార్తికేయ 2` సినిమా వ‌స్తే థాంక్యూ మూవీ దెబ్బ‌తింటుందని భ‌య‌ప‌డే అడిగాడు.. అందుకే నిఖిల్ ని అడిగి వుంటాడు. ఇది ప‌నికిమాలిన సినిమా అనుకుంటే అడ‌గాల్సిన అవ‌స‌రం ఏముంది?.. అంటూ దిల్ రాజుని సపోర్ట్ చేస్తూనే సెటైర్ వేశారు త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ‌.