Begin typing your search above and press return to search.

వీడియో: జ్వాలారెడ్డి ఝ‌డిపించేస్తున్నారుగా..?

By:  Tupaki Desk   |   26 March 2021 7:22 AM GMT
వీడియో: జ్వాలారెడ్డి ఝ‌డిపించేస్తున్నారుగా..?
X
నామ్ హై జ్వాలారెడ్డి.. నికాల్ దూంగ సబ్ కా హ‌డ్డీ..!! అంటూ ఫైర‌వుతున్న ఆవిడ ఎవ‌రో చూశారు క‌దా? ఆమె ఎవ‌రో కాదు.. సీటీమార్ లో ఫైరింగ్ లేడీ. పేరు జ్వాలారెడ్డి.. క‌బ‌డ్డీ కోచ్.. తెలంగాణ‌లో రెడ్డి గారు మోస్ట్ ప‌వ‌ర్ ఫుల్.. ఎదురుప‌డితే అంతే సంగతి.. ఎంత‌టి మొన‌గాడైనా అయిపోయాడే.. ట‌న్ను లోడ్ తో హెవీ డ్యూటీ లారీని అయినా న‌డిపేంత ట్యాలెంట్ మిసెస్ జ్వాలారెడ్డికి ఉంది.

మ‌రి అలాంటి ప‌వ‌ర్ ఫుల్ లేడీతో పెట్టుకున్న సామాన్య క‌బ‌డ్డీ కోచ్ గోపిచంద్ ప‌రిస్థితి ఏమిట‌న్న‌ది తెర‌పైనే చూడాల్సి ఉంటుంది. సీటీమార్ సినిమా ఆద్యంతం గోపిచంద్- త‌మ‌న్నా న‌డుమ స‌న్నివేశాలు ర‌క్తి క‌ట్టిస్తాయ‌ని సంప‌త్ నంది చెబుతున్నారు. జ్వాలారెడ్డి గా ప‌వ‌ర్ ఫుల్ రోల్ కి త‌మ‌న్నా డ‌బ్బింగ్ పూర్తి చేశారు. ఓ ఫైరింగ్ సీన్ కి డైలాగులు చెబుతున్న వీడియోని ట్విట్ట‌ర్ లో షేర్ చేయ‌గా అది వైర‌ల్ గా మారింది.

ఈ చిత్రంలో హిప్పీ ఫేం దిగంగ‌న సూర్య‌వంశీ- భూమిక కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. మ‌ణిశ‌ర్మ సంగీతం అందిస్తున్నారు. శ్రీ‌నివాసా సిల్వ‌ర్ స్క్రీన్ ప‌తాకంపై తెర‌కెక్కుతోంది. ఏప్రిల్ 2న సీటీమార్ రిలీజ‌వుతున్న సంగ‌తి తెలిసిందే.