Begin typing your search above and press return to search.

ఫొటో టాక్: ఈ రేంజ్ లో షాక్ ఇస్తే ఎలా తమన్నా..

By:  Tupaki Desk   |   16 Jan 2023 11:11 AM GMT
ఫొటో టాక్: ఈ రేంజ్ లో షాక్ ఇస్తే ఎలా తమన్నా..
X
పాల మీగడ లాంటి అందంతో.. నాటికీ, నేటికీ తరగని వన్నెతో సినిమాల్లో దూసుకెళ్తున్న హీరోయిన్ తమన్నా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసం లేదు. సినీ రంగంలో అడుగు పెట్టి 15 ఏళ్లు పూర్తి అవుతున్నా ఆమెకు ఉన్న క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఓ వైపు సినిమాలు, మరో వైపు వెబ్ సిరీస్ లతో బిజీగా ఉన్నప్పటికీ ఈ అమ్మడు... వరస ఫొటో షూట్లతో అభిమానులను అలరిస్తూ వస్తోంది. తాజాగా ఈ మిల్క్ బ్యూటీ తాజాగా నీలం రంగు డ్రెస్సులో మిలమిలా మెరిసిపోతూ హాట్ హాట్ ఫోజులిచ్చింది. ప్రస్తుతం తమన్నా లేటెస్ట్ ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి.

నాజూకైనా అందం, శిల్పి చెక్కినట్లు ఉండే నడుము, తీర్చిదిద్దినట్లుగా ఉండే ఫిగర్ తో కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తుంది తమన్నా. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో బ్లూ వెస్టర్న్ వేర్‌తో కనిపించి కవ్వించింది మిల్కీ బ్యూటీ. బ్లూ కలర్ వెస్టర్న్ వేర్‌ పైకి గోల్డ్, బ్లూ కలర్ ఇయర్ రింగ్స్ ధరించింది. మెస్సీ బన్ హెయిర్ స్టైల్ తమన్నా అందాన్ని రెట్టింపు చేసింది. వెరీ మినిమల్ యాక్ససెరీస్‌తోనే హై వోల్టేజ్ అందాన్ని ప్రదర్శించింది.

ప్రస్తుతం తమన్నా భాటియా మెహర్ రమేష్ డైరెక్షన్ లో చిరంజీవి హీరోగా బోళా శంకర్ సినిమా నటిస్తోంది. ఈ చిత్రంలో కీర్తి సురేష్ మెగాస్టార్ కు చెల్లెలి పాత్రలో చేయనుంది. సైరా చిత్రంలో చిరంజీవితో స్క్రీన్ షేర్ చేసుకున్న తమన్నా.. ఇప్పుడు భోళా శంకర్ సినిమాతో మరోసారి చిరంజీవితో స్క్రీన్ పంచుకోనుంది.

టాలీవుడ్ తో పాటు హిందీ, కన్నడ, మలయాళ చిత్రాల్లో కనిపించింది తమన్నా. దాదాపు అందరూ టాప్ యంగ్ హీరోల సినిమాల్లో నటించింది ఈ మిల్కీ బ్యూటీ. 15 ఏళ్ల సినీ కెరీర్‌లో 50కి పైగా సినిమాల్లో నటించింది తమన్నా. తెలుగుతో పాటు దాదాపు అన్ని భాషల సినిమాల్లో నటిస్తూ తన సత్తా చాటుతోంది. ఇన్నేళ్లలో తమన్నా అంటే ముందుగా గుర్తుకు వచ్చేది తన మిల్కీ అందాలే.  తన అందం, తన ఫిగర్ తో మత్తు ఎక్కిస్తుంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.