Begin typing your search above and press return to search.

కమెడియన్‌ సిక్స్‌ ప్యాక్‌ కేక

By:  Tupaki Desk   |   13 Sep 2018 10:11 AM GMT
కమెడియన్‌ సిక్స్‌ ప్యాక్‌ కేక
X
తమిళ కమెడియన్‌ సూరి తెలుగు ప్రేక్షకులు సుపరిచితుడే. డబ్బింగ్‌ చిత్రాల్లో సూరి కామెడీని ఫుల్‌ గా తెలుగు ప్రేక్షకులు ఎంజాయ్‌ చేస్తూనే ఉన్నారు. వడివేలు ఏ స్థాయిలో తమిళనాట కమెడియన్‌ గా క్రేజ్‌ ను దక్కించుకున్నాడో - ఇప్పుడు అంతకు మించిన స్టార్‌ డంను కమెడియన్ సూరి దక్కించుకున్నాడు. స్టార్‌ హీరోల సినిమాల్లో ఖచ్చితంగా ఈయన ఉంటున్నాడు. ఆమద్య కార్తీ హీరోగా నటించి తెలుగులో డబ్‌ అయిన ‘చినబాబు’ చిత్రంలో కీలక పాత్రలో నటించి నవ్వించిన సూరి తాజాగా శివ కార్తికేయన్‌ మరియు సమంత జంటగా తెరకెక్కిన ‘సీమ రాజా’ అనే చిత్రంలో నటించాడు.

సీమ రాజా చిత్రంలో సూరి సిక్స్‌ ప్యాక్‌ బాడీతో కనిపించబోతున్నాడు. తాజాగా సిక్స్‌ ప్యాక్‌ తో సూరి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సోషల్‌ మీడియాలో సూరి సిక్స్‌ ప్యాక్‌ బాడీకి ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. తమిళ సినీ వర్గాల్లోనే కాకుండా తెలుగు ప్రేక్షకులు కూడా సూరి లుక్‌ కు ఫిదా అవుతున్నారు. ఒక కమెడియన్‌ సిక్స్‌ ప్యాక్‌ ట్రై చేయడం చాలా అరుదు. గతంలో సునీల్‌ హీరోగా ప్రయత్నాలు చేస్తూ సిక్స్‌ ప్యాక్‌ చేయడం జరిగింది. రెండు సినిమాల్లో సిక్స్‌ ప్యాక్‌ తో కనిపించిన సునీల్‌ ఆ తర్వాత మళ్లీ మామూలుగా అయ్యాడు.

తాజాగా సూరి ప్రత్యేకంగా ‘సీమ రాజా’ చిత్రం కోసమే సిక్స్‌ ప్యాక్‌ ను చేశాడా లేదంటే హీరోగా ఏమైనా సినిమాలు చేస్తున్నాడా అనే విషయం ప్రస్తుతం తమిళ సినీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. హీరోగా మారేందుకు సూరి ఇలా సిక్స్‌ ప్యాక్‌ బాడీని చేసినట్లుగా కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కాని ఇప్పటి వరకు ఆ విషయమై సూరి ఎలాంటి ప్రకటన చేయలేదు.