Begin typing your search above and press return to search.

త‌మిళ స్టార్ హీరోలు టాలీవుడ్ కి క్యూ

By:  Tupaki Desk   |   22 Jun 2021 3:00 PM IST
త‌మిళ స్టార్ హీరోలు టాలీవుడ్ కి క్యూ
X
ప్ర‌స్తుతం పాన్ ఇండియా ట్రెండ్ హీరోల మైండ్ సెట్ ని మార్చేస్తోంది. కేవ‌లం ఒకే భాష‌కు ప‌రిమితం కావాల‌న్న ఆలోచ‌న ఇప్పుడు లేదు. అందుకే స్టార్ హీరోలంతా పొరుగు భాష‌ల్ని క‌లుపుకుని యూనివ‌ర్శ‌ల్ కాన్సెప్టుల‌తో అన్నిచోట్లా మార్కెట్ ని పెంచుకునే వ్యూహం ర‌చిస్తున్నారు.

ఇటీవ‌ల తెలుగు హీరోల సినిమాలు త‌మిళంలోనూ ఆడుతున్నాయి. ఇప్పుడు త‌మిళ హీరోలు స్ట్రెయిట్ తెలుగు సినిమాలు చేసేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. విజయ్- సూర్యా- ధనుష్ వంటి స్టార్ హీరోలు తమ తొలి స్ట్రెయిట్ తెలుగు మూవీని అతి త్వరలో చేయబోతున్నారు. ఇవి బ‌హుభాషా చిత్రాలుగా తెర‌కెక్క‌నున్నాయి. తెలుగు- తమిళంలో విడుదల ఉంటుంది. వీళ్లంద‌రికీ తమిళ మార్కెట్ బావుంది. ఇక‌ తెలుగులోనూ రాణిస్తున్నారు. అలాగే మ‌ల‌యాళ క‌న్న‌డ మార్కెట్ల‌లోనూ సుప‌రిచితం. అందువ‌ల్ల అన్నిచోట్లా రిలీజ్ చేసేందుకు ఆస్కారం ఉంటుంది.

ఇల‌య‌ద‌ళ‌ప‌తి విజ‌య్ హీరోగా వంశీ పైడిపల్లి ద‌ర్శ‌క‌త్వంలో దిల్ రాజు ఓ సినిమా నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం విజయ్ 100కోట్ల పారితోషికం అందుకుంటున్నారని క‌థ‌నాలొచ్చాయి. త‌మిళ మార్కెట్ ప్ల‌స్ తెలుగు మార్కెట్ ని దృష్టిలో ఉంచుకుని అంత పెద్ద మొత్తం ఇచ్చేందుకు దిల్ రాజు రెడీ అయ్యార‌ట‌. విజ‌య్ మూవీ ఏదైనా కేవ‌లం త‌మిళంలోనే 200కోట్లు వ‌సూల‌వుతుంది. తెలుగు మార్కెట్ బోన‌స్ లాంటిది.

అలాగే ధ‌నుష్ హీరోగా శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో భారీ బ‌హుభాషా చిత్రం తెర‌కెక్క‌నుంది. తెలుగు-త‌మిళం-మ‌లయాళ మార్కెట్ల‌ను టార్గెట్ చేయ‌నున్నారు. ఇక ధనుష్ జాతీయ హీరో కాబ‌ట్టి హిందీలోనూ మంచి మార్కెట్ ఉంది. అందుకే ఈ మూవీ కోసం ధ‌నుష్ కి ఏకంగా 50కోట్లు పైగా చెల్లిస్తున్నార‌ని తెలిసింది. మ‌రోవైపు త్రివిక్ర‌మ్ లేదా బోయ‌పాటితో స్ట్రెయిట్ తెలుగు సినిమా చేస్తున్న సూర్య కు భారీ పారితోషికం ముట్ట‌నుంద‌ని తెలిసింది. ఆ ముగ్గురి సినిమాల్ని పాన్ ఇండియా కేట‌గిరీలో రిలీజ్ చేసి భారీగా ఆర్జించాల‌న్న ప్లాన్ ఉంది. అందుకు త‌గ్గ‌ట్టే స‌ద‌రు హీరోలు పారితోషికాలు భారీగా గుంజేస్తున్నారు. వీళ్ల‌తో పాటు చాలామంది త‌మిళ హీరోల క‌న్ను ఇప్పుడు తెలుగు ప‌రిశ్ర‌మ‌పై ఉంది.