Begin typing your search above and press return to search.

అమేజాన్ ప్రైమ్ కు షాకిచ్చిన తమిళ్ రాకర్స్

By:  Tupaki Desk   |   9 May 2020 12:30 AM GMT
అమేజాన్ ప్రైమ్ కు షాకిచ్చిన తమిళ్ రాకర్స్
X
తమిళ్ రాకర్స్.. భారత దేశంలో విడుదలైన ఏ మూవీని అయినా అదే రోజు ఇంటర్నెట్ లో లీక్ చేస్తూ సినీ పరిశ్రమకు పెద్ద సవాల్ చేసిన కొత్త సినిమాల లీక్ వెబ్ సైట్ ఇదీ. దేశ విదేశాల్లో నెట్ వర్క్ పెంచుకొని ఆయా దేశాల్లో వెబ్ సైట్లు సృష్టించి కొత్త హెచ్.డీ సినిమాలు రిలీజ్ చేస్తూ సినీ పరిశ్రమకు కంటిమీద కునుకు లేకుండా చేసింది.

అప్పట్లో తమిళ సినీ పరిశ్రమ ఏకమై హీరో విశాల్ నేతృత్వంలో ఈ తమిళ్ రాకర్స్ లీకువీరులను కనిపెట్టి పోలీసుల ద్వారా జైలుకు పంపినా ఇప్పటికీ వీరి లీక్స్ పరంపర కొనసాగుతూనే ఉంది.

ప్రస్తుతం కరోనా-లాక్ డౌన్ తో అందరూ ఇంటికే పరిమితమయ్యారు. సినిమాలు-సీరియళ్లు ఆగిపోవడంతో అందరూ ఓటీటీ ఫ్టాట్ ఫామ్ లలో వచ్చే కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లను చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఓటీటీకి ఇప్పుడు జనం బాగా అలవాటుపడ్డారు. చాలా వెబ్ సిరీస్ లకు బాగా ప్రేక్షకాదరణ వస్తోంది.

ఇన్నాల్లు సినిమాలను లీక్ చేసిన తమిళ్ రాకర్స్ ఇప్పుడు వెబ్ సిరీస్ లను కూడా వదల్లేదు. తాజాగా అమెజాన్ పై విరుచుకుపడింది. అమెజాన్ ప్రైమ్ లో ఎంతో హిట్ అయిన ‘ది ఫ్యామిలీ మ్యాన్’ యాక్షన్ డ్రామా వెబ్ సిరీస్ హెచ్.డీ ప్రింట్ ను తమిళ్ రాకర్స్ ఇంటర్నెట్ లో విడుదల చేసింది. ఉచితంగా డౌన్ లోడ్ చేసుకొని చూడొచ్చని అందరికీ ఆఫర్ ఇచ్చింది.

ఎంతో హిట్ అయిన ఈ ది ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ ను రాజ్ నిడిమోరు, కృష్ణ డికే దర్శకత్వం వహించారు. మనోజ్ బాజ్ పాయ్, ప్రియమణి జంటగా నటించారు. ఈ ఎన్ఐఏ మధ్యతరగతి ఉద్యోగి కథ బాగా హిట్టయ్యింది.

అమేజాన్ ఎన్ని రకాలుగా ప్రయత్నించి డిలీట్ చేయించినా ప్రతీసారి వివిధ దేశాల్లోని కొత్త డొమైన్లతో ఈ వెబ్ సిరీస్ ను తమిళ్ రాకర్స్ లీక్ చేస్తూనే ఉండడంతో అమేజాన్ తల పట్టుకుంది.

ఇప్పటికే ఇటీవలే విడుదలైన ఎక్స్ ట్రాక్షన్, చపాక్, టర్మినేటర్, అంగ్రేసి మీడియా, మిసెస్ సీరియల్ కిల్లర్ లాంటి ఎన్నో చిత్రాలను తమిళ్ రాకర్స్ లీక్ చేసింది. ఇప్పుడు వెబ్ సిరీస్ లను కూడా వదలకుండా లీక్ చేస్తూ ఓటీటీ ఫ్టాట్ ఫామ్ లకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.