Begin typing your search above and press return to search.

రీమేక్ చేయండి ప్లీజ్

By:  Tupaki Desk   |   17 Oct 2018 9:56 AM GMT
రీమేక్ చేయండి ప్లీజ్
X
ఈ మధ్యకాలంలో తమిళ్ లో మంచి క్వాలిటీ సినిమాలు వస్తున్నాయి. హీరోకు పెద్దగా ఇమేజ్ లేకపోయినా కేవలం కంటెంట్ మీదే ఆధారపడి మంచి సక్సెస్ అందుకుంటున్నాయి. ఇటీవలే వచ్చిన విజయ్ సేతుపతి 96 అక్కడ ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. దీని రీమేక్ హక్కులను విడుదలకు ముందే కొనేసిన దిల్ రాజు ఆర్టిస్ట్ సెలక్షన్ పూర్తయ్యాక షూటింగ్ మొదలుపెట్టబోతున్నాడు. దీంతో పాటు విష్ణు విశాల్ హీరోగా రచ్చసన్ అనే మరో సినిమా కూడా రిలీజయ్యింది. అమలా పౌల్ హీరోయిన్ గా రూపొందిన ఈ మూవీకి తమిళనాడులో అద్భుతమైన థ్రిల్లర్ గా క్రిటిక్స్ ను కూడా మెప్పించింది.

16 ఏళ్లు దాటిన అమ్మాయిలు ఒక్కొక్కరుగా కిడ్నాప్ అవుతుంటారు. ఆ తర్వాత చాలా దారుణమైన స్థితిలో శవం రూపంలో దొరుకుతారు. పోలీస్ ఆఫీసర్ అయిన హీరో అక్క కూతురు కూడా ఇదే విధంగా హత్యకు గురవుతుంది. అసలు ఇవన్నీ చేస్తోంది ఎవరు ఇంత ఘోరానికి ఎందుకు ఒడిగడుతున్నారు అని తెలుసుకోవడానికి హీరో రంగంలోకి దిగుతాడు. చివరికి హంతకుడిని ఎలా పట్టుకున్నాడు అనేదే రచ్చసన్.

ఇది మంచి థ్రిల్లర్. దర్శకుడు రామ్ కుమార్ టేకింగ్ తో మెప్పించాడు. ఫస్ట్ హాఫ్ లో కొంత స్లోగా సాగినా ఆ తర్వాత ఎక్కడా కళ్ళు పక్కకు తిప్పుకోకుండా స్క్రీన్ ప్లే రాసుకోవడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు. కేసు ఇన్వెస్టిగేషన్ చేసే తీరు కథను ఊహించని మలుపులతో టర్న్ చేయడం ఇవన్నీ విశేషంగా ఆకట్టుకుంటాయి. ఇక జిబ్రాన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ దీనికి ప్రాణంగా నిలిచింది. ఒరిజినల్ వెర్షన్ చూసిన ప్రేక్షకులు ఇది తెలుగులో రీమేక్ చేస్తే బాగుంటుంది అని చెబుతున్నారు కానీ ఆర్టిస్ట్ సెలక్షన్ దీనికి చాలా కీలకం. విష్ణు విశాల్ మనకు బొత్తిగా తెలియని మొహం కాబట్టి డబ్బింగ్ చేస్తే వర్క్ అవుట్ కాదు. అందుకే రచ్చసన్ రీమేక్ తప్ప వేరే ఆప్షన్ లేదు. అయినా ఇంత ఇంటెన్సిటీ ఉన్న థ్రిల్లర్ ను టేకప్ చేయాలంటే హీరో దర్శకుడు సెట్ కావడం అంత ఈజీ అయితే కాదు. సినిమా ప్రేమికులు కోరుతున్నట్టు ఎవరో ఒకరు ముందడుగు వేస్తే ఏదో ఒక ఫలితం రాకపోదు.