Begin typing your search above and press return to search.
హైదరాబాద్ పై మనసుపారేసుకుంటున్న తమిళ హీరో
By: Tupaki Desk | 11 April 2022 11:30 PM GMTగత కొంత కాలంగా ఇండియన్ సినిమా దృష్టి టాలీవుడ్ వైపు మళ్లింది. ఇక్కడ ఏ సినిమా మొదలైనా సరే ప్రతీ ఒక్కరూ ఆరాతీస్తున్నారు. బిజినెస్ పరంగా ఆరాలు తీస్తున్నారు. భారీ స్థాయిలో రైట్స్ కి చెల్లించి అనువాద హక్కుల్ని దక్కించుకోవడానికి పోటీపడుతున్నారు. మరి కొంత మంది హీరోలు మన తెలుగు స్టార్ లతో కలిసి పని చేయడానికి ఆసక్తిని చూపిస్తుంటే మరి కొంత మంది స్టార్ లు తెలుగులో సినిమాలు చేస్తున్నారు. ఇలా అన్ని భాషలకు చెందిన వారంతా టాలీవుడ్ పై ప్రత్యేక దృష్టిని కనబరుస్తూ వార్తల్లో నిలుస్తున్నారు.
కొంత మంది తమిళ హీరోలు ఇప్పటికే టాలీవుడ్ లో పాగా వేయాలని ప్రయత్రాలు మొదలుపెట్టారు. ఒకే సారి తెలుగు, తమిళ భాషల్లో బైలింగ్వల్ సినిమాలని చూస్తూ ఇక్కడ కూడా తమ మార్కెట్ ని పెంచేసుకోవాలని చూస్తున్నారు. తమిళ హీరో ధనుష్ ఇటీవల 'సార్' పేరుతో తెలుగు, తమిళ భాషల్లో ఓ బైలింగ్వల్ మూవీకి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. యంగ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. సితార ఎంటర్ టైన్ మెంట్స్ , ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ, త్రివిక్రమ్ వైఫ్ సాయి సౌజన్య సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఇక ఇదే హీరో తరహాలో స్టార్ హీరో ఇళయదళపతి విజయ్ కూడా రంగంలోకి దిగేశారు. చాలా ఏళ్లుగా తెలుగులో పాగా వేయాలని ఎదురుచూస్తున్న ఆయన వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో ఓ భారీ ద్వి భాషా చిత్రాన్ని చేస్తున్నారు. ఈ మూవీని స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్నారు. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఇటీవలే చెన్నైలో లాంఛనంగా ప్రారంభమైంది. ఇదిలా వుంటే ఇదే కోలీవుడ్ కు చెందిన స్టార్ హీరో తెలుగు నేలపై ప్రేమని చూపించడం ఇప్పడు ఆసక్తికరంగా మారింది.
ఆ హీరో తల అజిత్ కుమార్. తెలుగులో అజిత్ నటించిన చిత్రాలకు భారీ స్థాయిలో మార్కెట్ అయితే లేదు కానీ కొంత వరకైతే క్రేజ్ వుంది. తెలుగులో తన సినిమాకు భారీ క్రేజ్ లేకపోయినా సరే ఎక్కువగా తన ప్రతి సినిమా షూటింగ్ ని హైదరాబాద్ లో చేయాలని ప్లాన్ చేసుకుంటుంటారు. 'వలిమై' చిత్రం తరువాత అజిత్ తన తదుపరి చిత్రాన్ని దర్శకుడు హెచ్ వినోద్ తో చేస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్ లో ఇటీవల నేర్కొండ పార్వై, వలిమై వంటి భారీ చిత్రాలొచ్చాయి.
తాఆజగా మరో చిత్రాన్ని చేస్తున్నారు. అజిత్ నటిస్తున్న 61వ చిత్రమిది. బోనీ కపూర్ అత్యంత భారీ స్థాయిలో ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఏకే61 అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈమూవీ రెగ్యులర్ షూటింగ్ సోమవారం హైదరాబాద్ లో ప్రారంభమైంది.
చెన్నై మౌంట్ రోడ్ సెట్ ని ప్రత్యేకంగా హైదరాబాద్ ఓ రీక్రియేట్ చేశారు. ఆ సెట్ లో ప్రస్తుతం షూటింగ్ మొదలైంది. ఈ సెట్ లో భారీ షెడ్యూల్ ని ప్లాన్ చేశారట. గత కొంత కాలంగా తన చిత్రాలకు సంబంధించిన షూటింగ్ ని క్రమం తప్పకుండా హైదరాబాద్ లో చేస్తూ వస్తున్న అజిత్ ఈ ప్రాంతంపై తనకున్న ప్రత్యేక ప్రేమని చాటుకుంటుండటం విశేషం. ఇదిలా వుంటే ఈ చిత్రంలో అజిత్ కు జోడీగా ఐశ్వర్యారాయ్ ని టీమ్ సంప్రదిస్తున్నారని తెలిసింది.