Begin typing your search above and press return to search.

సూర్య టైపులో ధైర్యంగా చెప్పేస్తే...

By:  Tupaki Desk   |   24 Feb 2016 5:30 PM GMT
సూర్య టైపులో ధైర్యంగా చెప్పేస్తే...
X
ఈ మధ్యన తెలుగులో వరుసగా నాలుగైదు తమిళ సినిమాలు రీమేక్‌ అయ్యేలా కనిపిస్తున్నాయి. మెగాస్టార్‌ చిరంజీవి ''కత్తి'' రీమేక్‌ పై కన్నేస్తే.. ఆయన పుత్రుడు చెర్రీ.. ''తని ఒరువన్‌'' ఆల్రెడీ మొదలెట్టేశాడు. ఇక త్వరలో రానున్న ''తెరి'' వంటి సినిమాలు కూడా రీమేక్‌ అయ్యే ఛాన్సుంది. అయితే తెలుగు హీరోలు రీమేక్‌ కు రెడీ ఉండటం వలన.. డైరెక్టుగా తమిళ సినిమాను ఇక్కడ రిలీజ్‌ చేసుకుని డబ్బులు సంపాదించలేకపోతున్నారు మా హీరోలు అంటూ అభిమానులు తెగ ఫీలవుతున్నారు. కాని వాస్తవానికి అక్కడ జరుగుతున్న సీన్‌ వేరు. వీరు అనుకుంటున్న కథలు వేరు.

ఇప్పుడు హీరో సూర్య సినిమాలు ఉన్నాయనుకోండి... మనోడు షూటింగ్‌ మొదలైన రోజునే తెలుగులో కూడా రిలీజ్‌ చేసేద్దాం అని ఫిక్సయిపోతున్నాడు. కాబట్టి తెలుగు కోసం కావల్సిన స్వల్ప మార్పులు అన్నీ ప్రొడక్షన్‌ టైములోనే ఫాలో అయిపోతున్నారు. ఇక రజనీకాంత్‌ సినిమాలు కూడా అంతే. విశాల్‌ కూడా ఇదే ఫాలో అవుతున్నాడు. కాని విజయ్‌ - అజిత్‌ - ధనుష్‌ వంటి స్టార్ల విషయానికొస్తే.. అసలు తెలుగులో వీరు రిలీజ్‌ చేస్తే అవి ఆడతాయో లేదో అనే సందేహంతో.. వారు అస్సలు రిలీజ్‌ అనేదే ప్లాన్‌ చేయడం లేదు. అందుకే వారి సినిమాను తమిళం హిట్టయితే తెలుగు రీమేక్‌ రైట్స్‌ అడుగుతున్నారు.. ఒకవేళ అక్కడ ఫ్లాపైతే అప్పుడు వారే తెలుగు డబ్ చేసుకొని ఎంతోకొంత వస్తుందిలే అని రిలీజ్‌ చేసుకుంటున్నారు.

అలా కాకుండా.. అందరూ సూర్య టైపులో ధైర్యంగా డే వన్‌ రిలీజ్‌ చేస్తే.. అయితే హిట్టవ్వుద్ది లేకపోతే ఫ్లాపవుద్ది. అప్పుడు ఎంచక్కా.. మా తమిళ సినిమాలను తెలుగు హీరోలు రీమేక్‌ చేసేసుకుంటున్నారు అని ఫీలవక్కర్లేదు.