Begin typing your search above and press return to search.

తెలుగు సినిమా చేయడానికి రెడీ అయిన తమిళ్ హీరో...!

By:  Tupaki Desk   |   26 July 2020 9:33 AM GMT
తెలుగు సినిమా చేయడానికి రెడీ అయిన తమిళ్ హీరో...!
X
సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్న నటుడు విజయ్ సేతుపతి. ఇండస్ట్రీలో అడుగుపెట్టిన తొలినాళ్లలో చిన్న క్యారెక్టర్స్ చేసుకుంటూ వచ్చి ఇప్పుడు క్రేజీ యాక్టర్ గా నిర్మాతల హీరోగా మారిపోయాడు. తన విలక్షమైన నటనతో ప్రేక్షకులను మెప్పిస్తూ 'మక్కల్ సెల్వన్' అనిపించుకున్నాడు. ఈ టాలెంటెడ్ హీరో మన తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. చిరంజీవి నటించిన 'సైరా నరసింహా రెడ్డి' సినిమాలో కీలక పాత్రలో నటించాడు. అలానే మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయమవుతున్న 'ఉప్పెన' సినిమాలో కూడా ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. ఇక 'పిజ్జా' 'పేట' వంటి డబ్బింగ్ సినిమాలతో కూడా తెలుగు ప్రేక్షకులను అలరించాడు. ఇదిలా ఉండగా విజయ్ సేతుపతి త్వరలో తెలుగులో హీరోగా సినిమా చేయబోతున్నాడని ఇండస్ట్రీ వర్గాల సమాచారం.

కాగా విజయ్ సేతుపతి డైరెక్ట్ తెలుగు సినిమాల్లో నటించినప్పటికీ హీరోగా చేయలేదు. ఇప్పుడు సేతుపతితో తెలుగులో సినిమా చేసేందుకు ప్లాన్స్ జరుగుతున్నాయి. అందులోనూ ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ సమంత అక్కినేని కూడా నటించే అవకాశాలు ఉన్నాయట. ఇప్పటికే విజయ్ సేతుపతి - సమంత లు 'సూపర్ డీలక్స్' సినిమాలో నటించారు. కాకపోతే ఈ సినిమాలో ఇద్దరి మధ్య సన్నివేశాలు ఉండవు. ఇప్పుడు ఈ తెలుగు తెరకెక్కబోయే ప్రాజెక్ట్ లో మాత్రం సమంత విజయ్ సేతుపతికి జోడీగా నటించనుందట. ఇక ఈ సినిమాని తెలుగులో నిర్మించి తమిళ్ లో డబ్బింగ్ చేయాలనుకోవడం ఇక్కడ గమనార్హం. మొత్తం మీద ఈ టాలెంటెడ్ యాక్టర్ త్వరలోనే హీరోగా టాలీవుడ్ ప్రేక్షకులను మెప్పించబోతున్నాడన్నమాట.

ఇదిలా ఉండగా విజయ్ సేతుపతి ప్రస్తుతం 'మాస్టర్' 'కడసాయి వివసాయి' 'మామనితనం' 'లాభమ్' 'కా.పే.రణసింగమ్‌' 'యాదుమ్ ఊరే యావరుమ్ కేళిర్' 'తుగ్లక్ దర్బార్' 'కాతు వాకుల రెండు కాదల్' వంటి తమిళ్ చిత్రాలతో పాటు అమీర్ ఖాన్ హీరోగా నటిస్తున్న 'లాల్ సింగ్ చద్దా' అనే హిందీ సినిమాలోనూ మరియు తెలుగులో 'ఉప్పెన'లో నటిస్తున్నాడు.