Begin typing your search above and press return to search.

మెగాస్టార్ కోసం విల‌న్ గా త‌మిళ హీరో!

By:  Tupaki Desk   |   31 May 2022 6:28 AM GMT
మెగాస్టార్ కోసం విల‌న్ గా త‌మిళ హీరో!
X
టాలీవుడ్ స్టార్స్ కోసం త‌మిళ‌, మ‌లయాళ, క‌న్న‌డ హీరోల‌ని మ‌న ద‌ర్శ‌కులు విల‌న్ లు గా తెర‌పైకి తీసుకొస్తూ స‌ద‌రు ప్రాజెక్ట్ ల‌పై బ‌జ్ ని క్రియేట్ చేస్తున్నారు. ఇప్ప‌టికే ప‌లువురు త‌మిళ‌, మ‌ల‌యాళ హీరోలు టాలీవుడ్ స్టార్స్ న‌టిస్తున్న క్రేజీ సినిమాల్లో విల‌న్ లుగా న‌టిస్తూ ఆక‌ట్టుకుంటున్నారు. తెలుగులో మంచి పేరుతో పాటు క్రేజీ ప్రాజెక్ట్ ల‌కు కీల‌కంగా మారి సినిమా విజ‌యాల్లో కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. దీంతో మ‌న స్టార్ హీరోలు, ద‌ర్శ‌కుల దృష్టి ఇప్ప‌డు త‌మిళ, మ‌ల‌యాళ హీరోల‌పై ప‌డింది.

తాజాగా మ‌రో త‌మిళ హీరోని మెగాస్టార్ చిరంజీవి కోసం విల‌న్ గా దించేస్తున్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. వివ‌రాల్లోకి వెళితే... మెగాస్టార్ చిరంజీవి ప్ర‌స్తుతం బ్యాక్ టు బ్యాక్ మూడు క్రేజీ చిత్రాల్లో న‌టిస్తున్నారు. ఇందులో రెండు రీమేక్ సినిమాలే. మెహ‌ర్ ర‌మేష్ డైరెక్ట్ చేస్తున్న‌'భోళా శంక‌ర్‌' మూవీని త‌మిళ బ్లాక్ బ‌స్ట‌ర్ 'వేదాలం' ఆధారంగా తెర‌కెక్కిస్తున్నారు. ఇక మోహ‌న్ రాజా డైరెక్ట్ చేస్తున్న 'గాడ్ ఫాద‌ర్‌' చిత్రాన్ని మ‌ల‌యాళ సూప‌ర్ హిట్ ఫిల్మ్ 'లూసీఫ‌ర్‌' ఆధారంగా తెలుగులో రీమేక్ చేస్తున్నారు.

దీనితో పాటు ఓ స్ట్రెయిట్ క‌థ‌తో బాబి డైరెక్ష‌న్ లో చిరు ఓ భారీ చిత్రం చేస్తున్నారు. చిరు 154వ ప్రాజెక్ట్ గా రూపొందుతున్న ఈ మూవీని మైత్రీ మూవీమేక‌ర్స్ అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఈ మూవీ కోసం 'వాల్తేరు వీర‌య్య‌' అనే టైటిల్ ప్ర‌ముఖంగా వినిపిస్తోంది. మేక‌ర్స్ కూడా ఇదే టైటిల్ ని ఫైన‌ల్ చేయ‌బోతున్నారు కూడా. వైజాగ్ పోర్ట్ నేప‌థ్యంలో సాగే ప‌వ‌ర్ ఫుల్ మాస్ మ‌సాలా యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ గా ఈ మూవీని తెర‌కెక్కిస్తున్నారు.

సినిమాలోని కీల‌క అతిథి పాత్ర‌లో మాస్ మ‌హారాజా ర‌వితేజ క‌నిపించ‌బోతున్న విష‌యం తెలిసిందే. శృతిహాస‌న్ హీరోయిన్ గా న‌టిస్తున్న ఈ మూవీలో ర‌వితేజ‌కు జోడీగా కేథ‌రిన్ క‌నిపించ‌బోతోంది.

ఇదిలా వుంటే ఈ మూవీ లో ప‌వ‌ర్ ఫుల్ విల‌న్ గా త‌మిళ హీరో విజ‌య్ సేతుప‌తి న‌టించ‌నున్నారంటూ వార్త‌లు వినిపిస్తున్నాయి. గ‌త కొన్ని రోజులుగా ఈ సినిమాలో విల‌న్ ఎవ‌ర‌న్న‌దానిపై ఆస‌క్తిక‌ర చ‌ర్చ జ‌రుగుతోంది. ఈ నేప‌థ్యంలో విజ‌య్ సేతుప‌తి పేరు తెర‌పైకి రావ‌డం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది.

సినిమాలో విజ‌య్ సేతుప‌తి పాత్ర చాలా ప‌వ‌ర్ ఫుల్ గా వుంటుంద‌ని, ఆయ‌న పాత్ర‌ ఇంట‌ర్వెల్ స‌మ‌యంలోనే రివీల్ అవుతుంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. దీనిపై చిత్ర బృందం ఎలాంటి ప్ర‌క‌ట‌న చేయ‌నుందో వేచి చూడాల్పిందే. ఇదిలా వుంటే ప్ర‌స్తుతం వెకేష‌న్ లో వున్న మెగాస్టార్ తిరిగి హైద‌రాబాద్ వ‌చ్చాక ఈ మూవీ తాజా షెడ్యూల్ కోసం మ‌లేసియా వెళ్లనున్నార‌ని వార్త‌లు వినిపిస్తున్న విష‌యం తెలిసిందే. అక్క‌డే 20 రోజుల పాటు కీల‌క ఘ‌ట్టాల‌ని పూర్తి చేయ‌నున్నార‌ని చిత్ర వ‌ర్గాల స‌మాచారం.