Begin typing your search above and press return to search.

బాలయ్య పై ఫైర్ అవుతున్న తమిళ తంబీలు.. #Whoisbalakrishna అంటూ ట్వీట్లు..!

By:  Tupaki Desk   |   22 July 2021 8:31 AM GMT
బాలయ్య పై ఫైర్ అవుతున్న తమిళ తంబీలు.. #Whoisbalakrishna అంటూ ట్వీట్లు..!
X
నందమూరి బాలకృష్ణ ఏ ఇంటర్వ్యూ ఇచ్చినా మీడియాకు సోషల్ మీడియాకు కావాల్సినంత స్టఫ్ దొరుకుతుంది. ఎందుకంటే బాలయ్య తన మనసులో మాటను మొహమాటం లేకుండా చెప్పేస్తుంటారు. ఈ క్రమంలో అప్పుడప్పుడు ఆయన చేసే కొన్ని వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతూ ఉంటాయి. గత నెల తన పుట్టిన రోజు సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో దేశ అత్యున్నత పురస్కారం 'భారత రత్న' తారక రామారావు కాలి గోటికి కూడా సరిపోదని కామెంట్ చేసి సంచలనం రేపారు. ఇప్పుడు తాజాగా బాలయ్య ఇచ్చిన ఇంటర్వ్యూలో మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ గురించి ఇలాంటి వ్యాఖ్యలే చేసి వార్తల్లో నిలిచాడు.

'ఆదిత్య 369' చిత్రం విడుదలై 30 ఏళ్లు పూర్తయిన సందర్భంగా బాలకృష్ణ.. ఓ న్యూస్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ క్రమంలో సంగీత దర్శకుడు ఇళయరాజాను పొగుడుతూ ఒక్కొక్కరికి ఒక స్టైల్ ఉంటుందని చెబుతూ.. సడన్ గా రెహమాన్ పేరు ప్రస్తావించారు. ''రెహ‌మాన్ ఎవ‌రో నాకు తెలియదు. నేను ప‌ట్టించుకోను. ప‌దేళ్ల‌కు ఓ హిట్ ఇస్తాడు. ఆస్కార్ అవార్డ్.. అందుకే 'భారతరత్న' అంటే రామారావు చెప్పుతో సమానం.. కాలి గోటితో సమానం అన్నాను చివరికి. ఇచ్చినోళ్లకు గౌరవం కానీ.. ఆయనకు గౌరవం ఏంటి? పదవులకు ఆయన అలంకారం ఏమో కానీ.. ఆయనకు పదవులు ఎప్పుడూ అలంకారం కాదని అన్నాను'' అంటూ బాలయ్య మాట్లాడారు.

బాలయ్య చేసిన ఈ వ్యాఖ్యలే ఇప్పుడు టాలీవుడ్ - కోలీవుడ్ లలో చర్చనీయాంశంగా మారాయి. ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ను తక్కువ చేసి మాట్లాడటం ఏంటని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున డిస్కషన్ జరుగుతోంది. అసలు బాలకృష్ణ ఎవరో కూడా తెలియదు అంటూ తమిళ ప్రేక్షకులు.. ట్విట్టర్ లో #Whoisbalakrishna అనే హ్యాష్ ట్యాగ్స్ తో బాలయ్యను ట్రోల్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. బాలకృష్ణ లాంటి ఒక సీనియర్ నటుడు ఓ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ని కించ పరచడం శోచనీయమని.. అదే రాజమౌళి గురించి ఓ తమిళ హీరో ఇలా మాట్లాడితే తెలుగు ప్రేక్షకులు ఊరుకుంటారా? అంటూ ట్వీట్లు పెడుతున్నారు. మరి ఈ ఇష్యూ ఎక్కడి దాకా వెళుతుందో చూడాలి. ఇదిలా ఉంటే బాలకృష్ణ హీరోగా నటించిన 'నిప్పు రవ్వ' చిత్రానికి ఏఆర్ రెహమాన్‌ వర్క్ చేసిన విషయాన్ని నెటిజన్స్ గుర్తు చేస్తున్నారు.