Begin typing your search above and press return to search.
బుల్లితెరపై టాప్ రేటింగ్ తెచ్చుకున్న డబ్బింగ్ చిత్రాలు ఏవంటే?
By: Tupaki Desk | 5 Feb 2023 2:30 AM ISTతెలుగు సినిమాలతో పాటు ఇతర భాషల నుంచి కూడా ప్రతి ఏడాది 100 సంఖ్యలో సినిమాలు.టాలీవుడ్ లో ప్రేక్షకుల ముందుకు వస్తుంటాయి. అయితే వీటిలో కొన్ని మాత్రమే ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా తెలుగులో ఎక్కువగా తమిళ సినిమాలు డబ్బింగ్ అయ్యి రిలీజ్ అవుతుంటాయి.
తమిళంలో స్టార్ హీరోలైన రజినీకాంత్, కమల్‌హాసన్, విజయ్, సూర్య, కార్తీ, విశాల్,విక్రమ్ లాంటి వారికి తెలుగు లో మంచి క్రేజ్ ఉంది. వీరి సినిమాలు తమిళంతో పాటు తెలుగులో కూడా ఒకేసారి రిలీజ్ అవుతూ ఉంటాయి. కొన్ని మంచి బ్లాక్‌బస్టర్ హిట్స్ కూడా సొంతం చేసుకుంటాయి.
తెలుగు ప్రేక్షకుల టెస్ట్ కి ఏమాత్రం కనెక్ట్ అయిన ఆ సినిమాలు ఖచ్చితంగా టాలీవుడ్‌లో బ్లాక్‌బస్టర్ అవుతాయి. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులు సినిమాలో ఎమోషనల్ ఎలిమెంట్స్ ని ఎక్కువగా ఆస్వాదిస్తుంటారు. అవి కథలో భాగంగా అంటే ఖచ్చితంగా అలాంటి సినిమాలకు బ్రహ్మరథం పడతారు. ఈ నేపథ్యంలోనే టాలీవుడ్‌లో చాలా మంది తమిళ హీరోలు సూపర్ హిట్ లని సొంతం చేసుకున్నారు.
ఈ తమిళ డబ్బింగ్ సినిమాలు బుల్లితెరపై కూడా రికార్డు స్థాయిలో టీఆర్పీ రేటింగ్ సొంతం చేసుకొని సంచలనం సృష్టించాయి. స్ట్రెయిట్ తెలుగు సినిమాలకు వచ్చే రేటింగ్ కంటే కొన్ని తమిళ డబ్బింగ్ సినిమాలకు ఎక్కువ టీఆర్పీ రావడం విశేషం.
ఇలా తెలుగు టెలివిజన్‌పై అత్యధిక టీఆర్పీ రేటింగ్ సొంతం చేసుకున్న సినిమాల జాబితాలో మొదటి స్థానంలో సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన రోబో నిలుస్తోంది. ఈ సినిమాకి 19.04 రేటింగ్ రావడం విశేషం.
దీని తర్వాత స్థానంలో విజయ్ ఆంటోని బిచ్చగాడు సినిమా నిలిచింది. ఈ సినిమాకి 18.78 టీఆర్పీ రేటింగ్ వచ్చింది. మూడో స్థానంలో 14.52 టీఆర్పీ రేటింగ్ తో సూపర్ స్టార్ రజనీకాంత్ కబాలి సినిమా నిలవడం విశేషం.
దాని తర్వాత కాంచన 2 ఏకంగా 13.1 టీఆర్పీ రేటింగ్ సొంతం చేసుకుని నాలుగో స్థానంలో ఉంది. ఇక ఐదో స్థానంలో ఏకంగా 12.35 రేటింగ్‌తో రిషబ్ శెట్టి హీరోగా గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన కాంతర మూవీ నిలవడం విశేషం. ఈ మధ్య కాలంలో తెలుగు సినిమాలు కూడా ఈ స్థాయిలో రేటింగ్ రాలేదనే చెప్పాలి. అలాంటి కాంతరా మూవీ బుల్లితెరపై రికార్డు స్థాయిలో టీఆర్పీ సొంతం చేసుకోవడం ఇప్పుడు టాలీవుడ్ లో సెన్సేషన్ గా మారింది. ఈ సినిమా.ఎలాంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఏకంగా 60 కోట్లకి పైగా తెలుగు లో కలెక్ట్ చేయడం విశేషం.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.