Begin typing your search above and press return to search.
తెలుగు ఫ్యాన్స్ లో పెరిగిన తమిళ సంస్కృతి
By: Tupaki Desk | 4 Sept 2020 5:00 AM ISTసౌత్ ఇండియాలో సినీ స్టార్స్ ను విపరీతంగా అభిమానిస్తూ ఉంటారు. ముఖ్యంగా తమిళం మరియు తెలుగు స్టార్ హీరోలకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ బాలీవుడ్ స్టార్స్ కు కూడా ఉండదేమో అనిపిస్తుంది. ఇదే సమయంలో సౌత్ హీరోల ఫ్యాన్స్ మద్య ఎప్పటికప్పుడు ఆధిపత్య పోరు కనిపిస్తూ ఉంటుంది. ఆమద్య తమిళ హీరోల ఫ్యాన్స్ ఒకరిపై ఒకరు దాడి చేసుకుని చంపుకునే వరకు వచ్చింది. ఇక ఒక హీరో అభిమానులు మరో హీరోపై బ్యాడ్ కామెంట్స్ చేయడం లేదంటే నెగటివ్ పబ్లిసిటీ చేయడం వంటివి చేస్తుంటారు. ఇప్పటి వరకు తమిళ హీరోల ఫ్యాన్స్ లో మాత్రమే కనిపించిన ఈ సంస్కృతి ఇప్పుడు తెలుగు హీరోల ఫ్యాన్స్ లో కూడా కనిపిస్తోంది.
ఇప్పటికే ఒకటి రెండు చోట్ల హీరోల ఫ్యాన్స్ గొడవ పడటం చంపుకోవడాలు జరిగాయి. హీరోలు మేము మేము బాగానే ఉన్నాం. మద్యలో మీరు కొట్టుకోవద్దు అంటూ సందేశాలు ఇస్తూనే ఉన్నారు. అయినా కూడా యాంటీ ఫ్యాన్ సంస్కృతి మాత్రం తగ్గడం లేదు. తాజాగా పవన్ బర్త్ డే సందర్బంగా యాంటీ ఫ్యాన్స్ చేసిన పనితో చాలా మంది ప్రముఖులు ఇబ్బంది పడ్డారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అధికారికంగా విడుదల చేసిన హ్యాపీబర్త్ డే హ్యాష్ ట్యాగ్ లో ఒకటి రెండు అక్షరాలు మార్చి దాన్ని ట్రెండ్ చేయడం మొదలు పెట్టారు.
హ్యాపీ బర్త్ డే పావల కళ్యాణ్ అంటూ కొందరు ప్రముఖులు హ్యాష్ ట్యాగ్ వినియోగించేలా చేసి వెంటనే వాటిని స్ర్కీన్ షాట్స్ సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. ఒక హీరో అభిమానుల వేడుకను ఉత్సాహంను నాశనం చేయడం కోసం ఇతర హీరోలకు చెందిన ఫ్యాన్స్ కొందరు ఇలా చేయడం ఏమాత్రం సమర్థనీయం కాదు. హీరోల మద్య ఎలాంటి సన్నిహిత వాతావరణం ఉందో అదే విధంగా హీరోల ఫ్యాన్స్ విషయంలో కూడా సోషల్ మీడియాలో కాని ఇతర వేదికలపై కాని సన్నిహిత సంబంధాలు ఉండాలి. ఇలా ఒకరిపై ఒకరు ట్రోల్స్ చేసుకోవడం తప్పుడు ప్రచారాలు చేసుకోవడం వంటి తమిళ సంస్కృతి మనకు వద్దంటూ కొందరు రియల్ ఫ్యాన్స్ విజ్ఞప్తి చేస్తున్నారు.