Begin typing your search above and press return to search.

హనీమూన్ ట్రిప్ లో దోపిడీ... షాక్ లో టాప్ యాంకర్

By:  Tupaki Desk   |   12 Jun 2020 1:30 AM GMT
హనీమూన్ ట్రిప్ లో దోపిడీ... షాక్ లో టాప్ యాంకర్
X
అప్పుడెప్పుడో వచ్చిన నాగార్జున అక్కినేని చిత్రం ‘మన్మథుడు’లో పారిస్ ట్రిప్ కు వెళ్లిన హీరో, హీరోయిన్లకు చెందిన విలువైన వస్తువులను దొంగలు కొట్టేసిన ఘటన గుర్తిందిగా. సినిమాలో కడుపుబ్బా నవ్వించిన అలాంటి సీన్ నిజ జీవితంలో జరిగితే... పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పే ఘటన ఇది. కెరీర్ లో పీక్ స్టేజీకి చేరుకున్న ఓ లేడీ టాప్ యాంకర్... తన స్నేహితుడినే పెళ్లాడి అతడితో హనీమూన్ ట్రిప్ కంటూ ఫ్రాన్స్ వెళ్లారు. ఫ్రాన్స్ కేపిటల్ పారిస్ లో వారు హనీమూన్ ఎంజాయ్ చేస్తుండగానే... అక్కడి దొంగలు ఆ యాంకర్ తో పాటు ఆమె భర్తకు చెందిన పాస్ పోర్టులు సహా మొత్తం వస్తువులన్నీంటినీ దోచేశారట. అది కూడా ‘మన్మథుడు’ సినిమాలో మాదిరే... సూట్ కేసు, ల్యాప్ టాప్ బ్యాగు అలా పక్కనపెట్టి అలా తిరిగి ఇలా చూసేసరికే దొంగలు వాటిని కొట్టేశారట.

ఆసక్తి రేకెత్తిస్తున్న ఈ ఘటన పూర్తి వివరాల్లోకెళితే... తమిళంలో టాప్ యాంకర్ గానే కాకుండా హోస్ట్ గా, సింగర్ గా రాణిస్తున్న దివ్య ఇటీవలే తన స్నేహితుడు శింబు థరకన్ ను పెళ్లి చేసుకున్నారు. ఈ క్రమంలో భర్తతో కలిసి దివ్య ఇటీవలే హనీమూన్ కోసం ఫ్రాన్స్ వెళ్లారు. పారిస్ లో హనీమూన్ ఎంజాయ్ చేస్తున్న తరుణంలోనే అ్కడి దొంంగలు ఈ కొత్త దంపతులకు చెందిన మొత్తం వస్తువులన్నింటినీ ఎత్తుకెళ్లిపోయారట. దీంతో షాక్ తిన్న దివ్య... అక్కడి పోలీసులతో పాటు ఇమ్మిగ్రేషన్ అధికారులకు ఫిర్యాదు చేశారు. అయితే అధికారుల నుంచి అంతగా స్పందన రావడం లేదని ఆవేదన వ్యక్తం చేసిన దివ్య... తనకు జరిగిన చేదు అనుభవాన్ని ఇన్ స్టాగ్రామ్ లో వెల్లడించారు.

పారిస్ లో ఓ చోట తన సూట్ కేసుతో పాటు ల్యాప్ టాప్ బ్యాగును ఓ పక్కనపెట్టిన దివ్య... అలా మరో పక్కకు తిరిగి వెనుదిరిగే క్షణకాలంలోనే దొంగలు సూట్ కేసుతో పాటు ల్యాప్ టాప్ బ్యాగ్ ను కూడా ఎత్తుకెళ్లారట. అందులో దివ్యతో పాటు ఆమె భర్త శింబే పాస్ పోర్టులు, రెండు ల్యాప్ టాప్ లు, చార్జర్లు, ఐపాడ్స్, బోస్ హెడ్ ఫోన్స్, ఎయిర్ ప్యాడ్, పెళ్లి దుస్తులు, మరింత విలువైన దుస్తులు, మేకప్ సామాగ్రి, కీలక డాక్యుమెంట్లు, బ్యాంకు డాక్యుమెంట్లు ఉన్నాయట. క్షణకాలంలో జరిగిన ఈ హఠాత్పరిణామంతో షాక్ తో కూరుకుపోయిన దివ్య దంపతులు నేరుగా అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఎవరూ పట్టించుకోలేదట. దీంతో చేసేది లేక ఎంబసీ, లీగల్ అదికారుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారట. అయినా కూడా పెద్దగా స్పందన లేదట. దీంతో దివ్య ఏం చేయాలో దిక్కు తోచని స్థితిలో పడిపోయిందట.