Begin typing your search above and press return to search.
ఎదగడానికి ఇండస్ట్రీ చోటివ్వలేదు.. చనిపోవడానికి ఆటో ఆశ్రయమిచ్చింది!
By: Tupaki Desk | 26 March 2021 1:30 AMసినిమా ఇండస్ట్రీ అనగానే.. నటీనటుల స్టార్ డమ్ మదిలో మెదులుతుంది. అందరూ చూసి ఆనందిస్తే.. కొందరు మాత్రం అందుకోవాలని ఆశపడుతుంటారు. వారిలో మరికొందరు ప్రయత్నం కూడా చేస్తారు. కానీ.. రెండు,మూడు శాతం మందికి మినహా అవకాశాలే రావు. వచ్చినవారిలోనూ ఏ ఒక్కరిద్దరో నిలదొక్కుకుంటారు.
ఏళ్ల తరబడి అవకాశాల కోసం ఎదురు చూసిన వారిలో చాలా మంది పరిస్థితి దుర్భరంగా ఉంటుంది. అప్పటికే జీవితం చాలా వరకు ఖర్చయిపోయి ఉంటుంది. ఆ వయసులో ఏం చేయాలో వేరే ఏ పని చేయాలన్నా కుదరదు. ఇటు చూస్తే అవకాశాలు ఎండమావుల మాదిరిగా కూడా కనిపించవు. ఇలాంటి దిక్కుతోచని పరిస్థితుల్లో తనువు చాలించే వారు ఎందరో!
అలాంటి వారిలో ఒకరే తమిళ నటుడు విరుత్చకాకాంత్. 2004లో తమిళనాట వచ్చిన ‘ప్రేమిస్తే’ సినిమాలో చిన్న పాత్రలో కనిపించాడీ నటుడు. ఈ అవకాశం కోసం ఎంతకాలంగా వేచి ఉన్నాడో తెలియదు. ఈ సినిమా తర్వాత మరెందులోనూ ఛాన్స్ రాలేదు. అవకాశాల కోసం ఎన్నో ఆఫీసులు తిరిగినప్పటికీ.. ఉపయోగం లేకుండాపోయింది.
ఇలాంటి పరిస్థితుల్లోనే అతని తల్లిదండ్రులు ఈ మధ్య ప్రాణాలు కోల్పోయారు. ఇటు అమ్మానాన్నలను పోగొట్టుకోవడం.. అటు జీవితం దుర్భరంగా మారడంతో తీవ్ర మానసిక కుంగుబాటుకు గురయ్యాడు. రూమ్ అద్దె చెల్లించడానికి కూడా డబ్బుల్లేకపోవడంతో బస్టాండ్, రైల్వే స్టేషన్లలో గడిపేవాడు. సరైన తిండి లేక, ఉండటానికి ఇల్లు లేక, అనారోగ్యంతో ఓ ఆటోలో నిద్రిస్తూ అక్కడే కన్నుమూశాడు విరుత్చకాకాంత్. దూరపు కొండలు నునుపు అనుకొని శిఖరం అధిరోహించడానికి వెళ్తున్న ఎంతో మంది.. మధ్యలోనే ఇలా రాలిపోతుండడం బాధాకరం.