Begin typing your search above and press return to search.

ఇంకెప్పుడు చేసుకుంటావు స్వామీ!

By:  Tupaki Desk   |   9 Nov 2022 12:30 AM GMT
ఇంకెప్పుడు చేసుకుంటావు స్వామీ!
X
టాలీవుడ్, కోలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్స్ అంతా పెళ్లి చేసుకుంటూ బ్యాచిల‌ర్ లైఫ్ కి గుడ్ బై చెప్పేస్తున్నారు. అయితే త‌మిళ హీరో విశాల్ మాత్రం నాలుగు ప‌దులు దాటినా ఇప్ప‌టికీ పెళ్లి ఊసెత్త‌డం లేదు. అదిగో ఇదిగో అంటూ కాలం గ‌డిపేస్తున్నాడు. టాలీవుడ్‌, కోలీవుడ్ ల‌లో యాక్ష‌న్ హీరో గా మంచి గుర్తింపుని సొంతం చేసుకున్న విశాల్ ప్ర‌స్తుతం క్రేజీ సినిమాల్లో న‌టిస్తూనే మ‌రో ప‌క్క ద‌క్షిణ భార‌త న‌టీన‌టుల సంఘం కార్య‌ద‌ర్శిగా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు.

గ‌త కొంత కాలంగా విశాల్ చుట్టూ ప్రేమ‌, పెళ్లికి సంబంధించిన వార్త‌లు షికారు చేస్తున్న విష‌యం తెలిసిందే. గ‌త కొన్నేళ్ల క్రితం విశాల్ త‌మిళ న‌టి, ప్ర‌ముఖ న‌టుడు శ‌ర‌త్ కుమార్ కూతురు వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్ కుమార్ తో ప్రేమ‌లో వున్నార‌ని, త్వ‌ర‌లోనే ఇద్ద‌రు క‌లిసి వివాహం చేసుకోబోతున్నారంటూ వ‌రుస‌గా క‌థ‌నాలు వినిపించాయి. ఈ వార్త‌ల‌ని నిజం చేస్తూ న‌డిగ‌ర్ సంఘం ఎన్నిక‌ల్లోనూ, అంతకు ముందు చెన్నైలో సంభ‌వించిన వ‌ర‌ద సాయం స‌మ‌యంలోనూ వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్ కుమార్ విశాల్ కు అండ‌గా నిల‌బ‌డింది.

దీంతో వీరిద్ద‌రి మ‌ధ్య ఏదో జ‌రుగ‌తోంద‌ని, ఇద్ద‌రు ప్రేమ‌లో వున్నార‌ని, త్వ‌ర‌లోనే వివాహం చేసుకోబోతున్నారంటూ వార్త‌లు వినిపించాయి. క‌ట్ చేస్తే విశాల్ `అర్జున్ రెడ్డి` మూవీలో న‌టించిన హైద‌రాబాద్ కు చెందిన యువ‌తితో ప్రేమ‌లో వున్నాడ‌ని, త్వ‌ర‌లోనే ఇద్ద‌రు పెళ్లి చేసుకోబోతున్నార‌ని వార్త‌లు మొద‌ల‌య్యాయి. ఆ వార్త‌ల‌ని నిజం చేస్తూ ఇద్ద‌రికి ఎంగేజ్ మెంట్ కూడా జ‌రిగింది. మ‌ధ్య‌లో ఏం జ‌రిగింతో ఏమో తెలియ‌దు కానీ విశాల్ త‌న ఎంగేజ్ మెంట్ ని ర‌ద్దు చేసుకున్నాడు.

అప్ప‌టి నుంచి సినిమాల‌పై దృష్టి సారించిన విశాల్ పెళ్లి గురించిన ఊపే ఎత్త‌డం లేదు. అయితే ఇటీవ‌ల చెన్నైలో ఓ ఛారిట‌బుల్ ట్ర‌స్ట్ ఆథ్వ‌ర్యంలో 11 మంది జంట‌ల‌కు వివాహం జరిపించారు. వారికి అందిరికి విశాలే తాళి బొట్లు అంద‌జేశారు.

అంతే కాకుండా వారికి అవ‌స‌ర‌మైన వ‌స్తువుల‌ని అంద‌జేశాడు. ఈ సంద‌ర్భంగా విశాల్ మాట్లాడుతూ త‌న‌కు అరేంజ్డ్ మ్యారేజ్ సెట్ కాద‌ని, ప్రేమించిన అమ్మాయితోనే తాను ఏడ‌డుగులు వేస్తాన‌ని స్ప‌ష్టం చేశాడు. ప్ర‌స్తుతం మా బిల్డింగ్ నిర్మాణం జ‌రుగుతోంద‌ని అది పూర్తి కాగానే ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటాన‌న్నాడు. ఇంత‌కీ త‌ను ఎవ‌రిని ప్రేమిస్తున్నాడ‌న్న విష‌యాన్ని మాత్రం వెల్ల‌డించ‌లేదు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.