Begin typing your search above and press return to search.

ట్రైలర్‌ టాక్‌: మాజీ లవర్స్ తమాషా

By:  Tupaki Desk   |   22 Sep 2015 5:36 PM GMT


రణ్ బీర్ కపూర్, దీపికా పదుకునే జంటగా రూపొందిన లేటెస్ట్ రొమాంటిక్ ఎంటర్టెయినర్ తమాషా. యే జవానీ హై దివానీ తర్వాత ఈ మాజీ లవర్స్ జోడీ కట్టారు ఈ సినిమాలో. మూడు నిమిషాల ట్రైలర్ ని.. హీరో, హీరోయిన్ ల మీదే రిలీజ్ చేశాడు డైరెక్టర్ ఇంతియాజ్ ఆలీ. రణ్ బీర్, దీపికలు కామెడీ టైమింగ్ లో ఏ రేంజ్ ఎక్స్ పర్ట్స్ అనే విషయం.. తమాషా ట్రైలర్ చూస్తే మరోసారి ప్రూవ్ అవుతుంది.

ఓ ప్రేమ జంట, దగ్గరవడం, తర్వాత అపార్ధాలతో విడిపోవడం, మనసు మార్చుకొమ్మని హీరో అడగడం, అప్పటికే తనకు పెళ్లి సెట్టయిందని హీరోయిన్ చెప్పడం, తర్వాత ఇద్దరూ కలిసి చెక్కేయడం.. ట్రైలర్ చూస్తుంటే స్టోరీ చాలాసార్లు చూసిందేగా అనిపిస్తున్నా.. కనిపించని పాయింట్ ని దేన్నో పట్టుకుని ఈ మూవీ తీశాడు డైరెక్టర్.

ముఖ్యంగా హీరో, హీరోయిన్ల కెమిస్ట్రీయే ఈ మూవీకి హైలైట్ అని చెప్పాలి. లిప్ లాక్స్ కూడా ఉన్నాయనే విషయాన్ని.. ట్రైలర్ లో ఒక ఫ్రేమ్ తో చూపించారు. ఏఆర్ రెహమాన్ అందించిన మ్యూజిక్ వినసొంపుగా డిఫరెంట్ ఉంది. అయితే.. స్టోరీ విషయానికొచ్చేసరికి.. డైరెక్టర్ చేసిన జిమ్మిక్ భలేగాఉంది. అదే స్టోరీనా? అంటూ తనే క్వశ్చన్ చేశాడు పలుమార్లు. అదేంటో తెలియాలంటే నవంబర్ 27వరకూ ఆగాల్సిందే.