Begin typing your search above and press return to search.

నా పెళ్లి గురించి మీకెందుకంటున్న మిల్కీ బ్యూటీ

By:  Tupaki Desk   |   14 Aug 2018 1:30 AM GMT
నా పెళ్లి గురించి మీకెందుకంటున్న మిల్కీ బ్యూటీ
X
మిల్కీ బ్యూటీ తమన్నా సినిమాలతోనే కాకుండా స్టోర్ ఓపెనింగ్స్.. బ్రాండ్ ఎండార్స్మెంట్స్ లాంటి వాటితో ఎప్పుడూ బిజీగా ఉంటుంది. ఈమధ్య హ్యపీ మొబైల్స్ కు బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపికయింది. ఈ సందర్భంగా మీడియాతో ముచ్చటించిన తమన్నా రిపోర్టర్ల ప్రశ్నలకు ఇంట్రెస్టింగ్ సమాధానాలు ఇచ్చింది.

పవన్ కళ్యాణ్ గారిని 'కెమెరామెన్ గంగతో రాంబాబు తర్వాత ఎప్పుడైనా కలిశారా అని అడిగితే "పవన్ కళ్యాణ్ గారిని ఆ సినిమా తర్వాత ఎయిర్ పోర్టులో రెండు మూడు సార్లు కలిశాను. చాలా హంబుల్ పర్సన్. ఎప్పుడు కలిసినా చాలా సింపుల్ గా ఉంటారు. ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నా.. ఈ లెవల్ కి రీచ్ అయినా ఆయన సింప్లిసిటీని మాత్రం వదులుకోలేదు. ఈ విషయంలో ఆయన నాకు పెద్ద ఇన్స్‌స్పిరేషన్" అని చెప్పింది.

పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టారు కదా సపోర్ట్ చేస్తారా అని అడిగితే "నాకు పాలిటిక్స్ గురించి అసలేమీ తెలియదు. కొంచెం తెలిసినా సపోర్ట్ చేసేదాన్ని.. పవన్ కళ్యాణ్ గారు ఏ పని చేసినా నా వైపు నుండి బెస్ట్ విషెస్ ఎప్పుడూ ఉంటాయి." తమన్నాను మీ పెళ్లి ఎప్పుడు అని అడిగితే మాత్రం కస్సుబుస్సులాడింది. "నా పెళ్లి గురించి మీకెందుకండీ. మీకు పెళ్లయిందా? మీరు హ్యాపీగా ఉన్నారా? నా పెళ్లి గురించి ఇంటర్నెట్లో చాలా వార్తలు చూస్తున్నాను. నాకు అతడితో, ఇతడితో పెళ్లి అవుతుంది అని రాస్తున్నారు. నాకది ఆశ్చర్యంగా ఉంది. ఇతర హీరోయిన్లకు మంచి హస్బెండ్ దొరికాడు కాబట్టి త్వరగా పెళ్లయింది. అందరికీ అలా దొరకాలి కదా... మీ అందరి ఆశీస్సులతో నాకు మంచి హస్పెండ్ దొరుకుతాడని ఆశిస్తున్నాను. ప్రస్తుతానికి నేను ఇపుడు నా పనులతో చాలా బిజీగా ఉన్నాను" అని చెప్పింది..

తన ఫేవరెట్ హీరో ఎవరని ఆడిగితే " ఇది అన్‌ఫెయిర్ క్వశ్చన్.. ప్రభాస్, రానా, చరణ్, నేను వర్క్ చేసిన హీరోలందరూ అందరూ నాకు ఇష్టమే. ఇలా చాలామందితో కలిసి పని చేసే అవకాశం రావడం నా అదృష్టం" అని చెప్పింది. 'సైరా' సినిమా లో తన పాత్ర గురించి ఆడిగితే "సైరా లో నాదొక కీలక పాత్ర. గతంలో గతంలో సూరి సర్‌తో 'ఊసరవెల్లి' సినిమా చేశాను. 'సైరా'లో చిరంజీవి గారితో పని చేయడం సంతోషంగా ఉంది. 'బాహుబలి'లో నేను చేసిన పాత్రకు ఎంత మంచి పేరొచ్చిందో సైరాలో చేసే పాత్రకు కూడా మంచి గుర్తింపు వస్తుందనే నమ్మకం ఉంది'' అంటూ ముగించింది.