Begin typing your search above and press return to search.

లైసెన్స్ ఉందా మ్యాడ‌మ్ లేక‌పోతే పోలీస్ అరెస్ట్ చేస్తారు!

By:  Tupaki Desk   |   30 Dec 2020 12:31 PM GMT
లైసెన్స్ ఉందా మ్యాడ‌మ్ లేక‌పోతే పోలీస్ అరెస్ట్ చేస్తారు!
X
త‌మ‌న్నా భాటియా డేరింగ్ గురించి తెలియాలంటే ఇదిగో ఈ వీడియో చూడాల్సిందే. క్ష‌ణ కాలం ఊపిరి బిగ‌‌బ‌ట్టి త‌థేకంగా క‌న్నార్ప‌కుండా చూసేలా చేస్తుంది ఇది. ఇంత‌కీ ఏం చేసింది? అంటే.. మీరే చూడండి.

మారుతి కార్ స్టీరింగ్ అయినా కంట్రోల్ చేయ‌గ‌ల‌దా? అనుకుంటే ఏకంగా ప్ర‌యివేట్ ట్రావెల్ బ‌స్సునే 100 కెఎం ప‌ర్ అవ‌ర్ స్పీడ్ తో తోలేస్తోంది. ఆ ప‌క్క‌నే డ్రైవ‌ర్ ఉన్నా కానీ ఎవ‌రినీ ప‌ట్టించుకోకుండా అంత డేరింగ్ గా బ‌స్సు తోలేయ‌డం అంటే మాట‌లా? ఇంత‌కీ లైసెన్స్ ఉందా మ్యాడ‌మ్ లేక‌పోతే పోలీస్ అరెస్ట్ చేస్తారు!

అన్న‌ట్టు .. భ‌యం అన్న‌దే లేకుండా ఇంత సాహ‌సం ఎందుక‌ని చేసింది? అంటే.. ఇదంతా షూటింగ్ కోస‌మేన‌ని అక్క‌డ సెటప్ చూస్తే అర్థ‌మ‌వుతోంది. ప్ర‌స్తుతం గోపిచంద్ స‌ర‌స‌న సీటీమార్ లో న‌టిస్తున్న త‌మ‌న్నా ఆన్ లొకేష‌న్ లో బ‌స్ డ్రైవ‌ర్ అవ‌తార‌మెత్తిందిలా. ``వెన్ డ్రైవింగ్ ఏ కార్ టు వ‌ర్క్ ఫీల్స్ టూ మెయిన్ స్ట్రీమ్.. సీటీమార్.. సెట్ లైఫ్`` అంటూ అదిరిపోయే వ‌న్ లైన‌ర్ క్యాప్ష‌న్ ఇచ్చింది ఈ వీడియోని షేర్ చేసి. అన్న‌ట్టు ఎస్.ఎం.ఎస్ ట్రావెల్ బ‌స్సు న‌డిపిస్తోంది.. ? తాను ఇందులో క‌బ‌డ్డీ టీమ్ కోచ్ క‌దా? ఇంత‌కీ గోపీచంద్ తో ఏదైనా రుబాబ్ న‌డిచిందా? ఏమో సినిమా చూస్తే కానీ తెలీదేమో! సంప‌త్ నంది సీటీమార్ కి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.


వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : https://www.instagram.com/p/CJaxGILhFV6/?igshid=glp3feb6zc5r