Begin typing your search above and press return to search.

పిక్‌ టాక్‌ : హరివిల్లు అందాల మద్య అంతకు మించిన అందం

By:  Tupaki Desk   |   27 Jun 2021 10:30 AM GMT
పిక్‌ టాక్‌ : హరివిల్లు అందాల మద్య అంతకు మించిన అందం
X
మిల్కీ బ్యూటీ తమన్నా ఇండస్ట్రీలో అడుగు పెట్టి పుష్కర కాలం దాటినా కూడా ఇంకా అందం విషయంలో ఏమాత్రం తగ్గలేదు. ఆమె ముందు ముందు కూడా తన అందంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూనే ఉంటుంది అనడంలో సందేహం లేదు. అందంతో పాటు అభినయం కూడా తెలిసిన తమన్నా ఇప్పటికి వెబ్‌ సిరీస్‌.. సినిమాలు త్వరలో టీవీ షో అంటూ బిజీ బిజీగానే ఉంది. ఎంత బిజీగా ఉన్నా కూడా పకృతిని ఆస్వాదిస్తూ ఆమె షేర్‌ చేస్తున్న ఫొటోలు మరియు వీడియోలు అందరిని ఆకర్షిస్తూ ఉంటాయి.

తాజాగా తమన్నా షేర్‌ చేసిన ఈ ఫొటో ప్రత్యేకంగా నిలిచింది. పింక్ డ్రస్ లో రాయల్‌ లుక్ మరియు ఫోజుతో తమన్నా ను చూడవచ్చు. ఈ ఫొటోను షేర్‌ చేసిన తమన్నా రెయిన్‌ బో అందాలను పరిశీలిస్తున్నట్లుగా చెప్పుకొచ్చింది. అందమైన హరివిల్లును అంతకంటే అందమైన మిల్కీ బ్యూటీ తమన్నా చూస్తుందంటే వింతగా ఉందంటూ ఆమె అభిమానులు నెట్టింట కామెంట్స్ చేస్తున్నారు. మిల్కీ బ్యూటీ తమన్నా అందం ముందు రెయిన్‌ బో కూడా చిన్న బోతుంది కదా అంటూ కొందరు కామెంట్స్‌ చేస్తున్నారు.

ఇక తమన్నా సినిమాల విషయానికి వస్తే త్వరలో సిటీమార్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. గుర్తుందా శీతాకాలం సినిమాతో పాటు మరి కొన్ని సినిమాలు ఇంకా వెబ్‌ సిరీస్ లను కూడా చేస్తోంది. త్వరలో జెమిని టీవీలో రాబోతున్న ఒక టాక్ షో ద్వారా కూడా ఈమె ప్రేక్షకుల ముందుకు వస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.