Begin typing your search above and press return to search.

వీడియో: ముద్దుగుమ్మ మీసం జారే

By:  Tupaki Desk   |   28 March 2021 5:30 AM GMT
వీడియో: ముద్దుగుమ్మ మీసం జారే
X
మిల్కీ బ్యూటీ తమన్నా ఈ మధ్య పెద్ద సినిమాల్లో కనిపించలేక పోయినా కూడా చిన్న సినిమాల్లో వరుసగా అవకాశాలు దక్కించుకోవడం తో పాటు వెబ్ సిరీస్ ల్లో కూడా నటిస్తుంది. ఈమె నటించిన 11th అవర్ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కు సిద్ధంగా ఉంది. ఇదే సమయంలో గోపిచంద్ తో ఈమె కలిసి నటించిన సిటీమార్ సినిమా కూడా విడుదలకు సిద్దంగా ఉంది. ఏప్రిల్ 2న విడుదల అవ్వాల్సి ఉన్నా కూడా సినిమా కు వైల్డ్ డాగ్ కారణంగా వాయిదా వేశారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే తమన్నా తాజాగా షేర్ చేసిన వీడియో ఒకటి వైరల్ అయ్యింది.

ఆ వీడియోలు తమన్నా మీసం పెట్టుకునేందుకు ప్రయత్నిస్తూ ఉంటే అది జారీ పోవడం జరుగుతుంది. అలా జారిపోతున్న మీసంను ఆమె మళ్ళీ పెట్టుకుంటూ ఉన్న వీడియోను షేర్ చేసింది. మాణిక్యం మీసాల రహస్యం ఏంటి అంటూ తన వీడియోకు కామెంట్ పెట్టింది. ఒక సినిమా ప్రమోషన్ లో భాగంగా తమన్నా ఇలా మీసాలు పెట్టుకుని సరదాగా వీడియో చేయాలనుకుంటే రెండు సార్లు ప్రయత్నించినా కూడా ఆమె మీసాలు పెట్టుకోలేక పోయింది. చివరకు ఆమె సాధించి ఫోటోలు కూడా షేర్ చేసింది.