Begin typing your search above and press return to search.

#మిల్కీ డౌట్! స్నానం చేయాలా వద్దా అనేది ప్రశ్న!!

By:  Tupaki Desk   |   3 Jun 2021 4:30 PM GMT
#మిల్కీ డౌట్! స్నానం చేయాలా వద్దా అనేది ప్రశ్న!!
X
మిల్కీ వైట్ బ్యూటీ త‌మ‌న్నా చిలిపి ప్ర‌శ్న విన్నారా? స్నానం చేయాలా వద్దా? అనేది ఇప్పుడు నా ప్రశ్న!! అంటూ షవ‌ర్ బాత్ కోసం రెడీ అవుతున్న‌ప్ప‌టి ఓ ఫోటోని షేర్ చేసి అభిమానుల‌కు డౌట్స్ పెట్టేసింది. ఇంత‌కీ మిల్కీ స్నానం చేసిందా లేదా? అన్న‌దే ఇప్పుడు అంద‌రి డౌట్.

అయినా అలా బుంగ మూతి పెట్టి అంత గొప్ప విష‌యం సోష‌ల్ మీడియాల్లోనే చెప్పాలా? అంటూ అభిమాన‌ జ‌నం అంతా క‌న్ఫ్యూజ‌న్ లో ఉన్నారు. అలా ష‌వ‌ర్ టాస్క్ ని బ‌య‌టికి తెచ్చి తెలివిగా త‌న వెబ్ సిరీస్ న‌వంబ‌ర్ స్టోరీస్ కి ప్ర‌మోష‌న్ చేసుకుంటోంది.

న‌వంబ‌ర్ స్టోరి లాంటి ప్ర‌త్యేక‌మైన షోలో న‌టించే అవ‌కాశం త‌న‌కు క‌ల్పించినందుకు హాట్ స్టార్ వాళ్ల‌కు ధ‌న్య‌వాదాలు తెలిపిన త‌మ‌న్నా.. ఈరోజు 4 పీఎం ట్విట్ట‌ర్ లో తన‌తో ముచ్చ‌టించాల‌నుకుంటే @DisneyplusHSVIP వ‌ద్ద‌ క‌ల‌వాల‌ని అభిమానుల్ని కోరింది. మీ ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం కావాల‌ని అనుకుంటే #హాట్ స్టార్ స్పెష‌ల్స్ న‌వంబ‌ర్ స్టోరిని ప్ర‌మోట్ చేయాలని అంది.

గోపిచంద్ స‌ర‌స‌న సీటీమార్ చిత్రంలో త‌మ‌న్నా న‌టించారు. జ్వాలారెడ్డిగా ప‌వ‌ర్ ఫుల్ పాత్ర‌లో త‌మ‌న్నా క‌నిపించ‌నుంది. ఈ సినిమా ప్ర‌స్తుత క్రైసిస్ వ‌ల్ల రిలీజ్ వాయిదా ప‌డింది. త‌మ‌న్నా న‌టించిన తొలి వెబ్ సిరీస్ లెవంథ్ అవ‌ర్ ఇంత‌కుముందు ఓటీటీలో స్ట్రీమింగ్ అయిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌వీణ్ స‌త్తారు ఈ సిరీస్ కి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.