Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: రోమ‌న్ సుంద‌రి దారి త‌ప్పి ఇటొచ్చిందేంటి..!

By:  Tupaki Desk   |   16 April 2021 3:30 PM GMT
ఫోటో స్టోరి: రోమ‌న్ సుంద‌రి దారి త‌ప్పి ఇటొచ్చిందేంటి..!
X
రోమ్ సంస్కృతి గురించి రోమ‌న్ ల చ‌రిత్ర గురించి హైస్కూల్ సోష‌ల్ పుస్త‌కాల్లో చదువుకున్నాం. చాలావ‌ర‌కూ హాలీవుడ్ సినిమాల్లో చూశాం. ముఖ్యంగా ఆస్కార్ మూవీ ట్రాయ్ లో ఈ సంస్కృతి ఎంతో గొప్ప‌గా క‌నిపిస్తుంది. ఇక ట్రాయ్ (రోమ్ స‌మీప న‌గ‌రం పేరు) మూవీలో ఆ న‌గ‌ర‌పు అంద‌గ‌త్తెల వేషధార‌ణ‌ను త‌ల‌పిస్తూ ఇదిగో ఇప్పుడిలా మిల్కీ వైట్ బ్యూటీ చేసిన ప్ర‌యోగం కుర్రాళ్ల గుండెల్ని హ‌త్తుకుంటోంది.

చూస్తుంటే రోమ్ నుంచి దారి త‌ప్పి వ‌చ్చిందా ఈ రోమ‌న్ బ్యూటీ? అంటూ ఒక‌టే ప‌రేషాన్ అవుతున్నారు. మ‌రో కోణంలో చూస్తే దేవతా సుంద‌రీమ‌ణులు రంభ ఊర్వ‌శి మేన‌కల‌కు రీప్లేస్ మెంట్ లా ఎంతో అందంగా క‌నిపిస్తోంద‌ని బోయ్స్ తెగ పొగిడేస్తున్నారు. కొంద‌రైతే పికాసో చిత్రంలా.. ర‌వివ‌ర్మ గీసిన చిత్త‌రువులా ఉంది అంటూ క‌విత‌లు అల్లేస్తున్నారు.

మొత్తానికి మిల్కీ వైట్ బ్యూటీ త‌మ‌న్నా ఈ మెరూన్ క‌ల‌ర్ డిజైన‌ర్ లుక్ లో యూత్ మైండ్ బ్లాక్ చేసింది. కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే త‌మ‌న్నా న‌టించిన సీటీమార్ రిలీజ్ కి రావాల్సి ఉంది. మిల్కీ కీల‌క పాత్ర‌లో మొద‌టి వెబ్ సిరీస్ లెవంథ్ అవ‌ర్ ఈ ఏప్రిల్ 9 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న సంగ‌తి తెలిసిందే. కార్పొరేట్ థ్రిల్లర్ క‌థాంశంతో తెర‌కెక్కిన ఈ సిరీస్ లో తమన్నా ఆస‌క్తిక‌ర పాత్ర‌లో న‌టించారు. కార్పొరేట్ యుద్ధంలో గెలుపే ధ్యేయంగా పోరాటం సాగించే కంపెనీ య‌జ‌మానురాలు ఆరత్రికా రెడ్డి పాత్రలో త‌మ‌న్నా మెప్పించారు.