Begin typing your search above and press return to search.

16 ఏళ్ల కెరీర్ త‌ర్వాత‌ మిల్కీ బ్యూటీ ఫేడ‌వుట్..?

By:  Tupaki Desk   |   12 March 2021 12:30 AM GMT
16 ఏళ్ల కెరీర్ త‌ర్వాత‌ మిల్కీ బ్యూటీ ఫేడ‌వుట్..?
X
కొత్త నీరు వ‌చ్చి పాత నీరు వెళుతుంటుంది. ఏ రంగానికి అయినా ఇది వ‌ర్తిస్తుంది. ముఖ్యంగా గ్లామ‌ర్ ప్ర‌పంచంలో క‌థానాయిక‌ల మైలేజ్ అతి స్వ‌ల్పంగా ఉంటుంద‌న్న‌ది తెలిసిందే. స‌క్సెస్ లేనిదే ఈ పరిశ్ర‌మ‌లో కొన‌సాగ‌డం చాలా క‌ష్టం. కానీ పరిశ్ర‌మ‌లో జ‌యాప‌జ‌యాల‌తో సంబంధం లేకుండా సుదీర్ఘ కాలం మ‌నుగ‌డ సాగించిన ‌నాయిక‌గా త‌మ‌న్నా పేరు మార్మోగుతోంది. మిల్కీ హ‌వా టాలీవుడ్ లో ఇప్ప‌టికీ త‌గ్గ‌క‌పోవ‌డం హాట్ టాపిక్ గా మారింది.

2005లో శ్రీ అనే చిత్రంతో టాలీవుడ్ లో అడుగు పెట్టిన త‌మ‌న్నా దాదాపు 16 ఏళ్ల కెరీర్ లో క్రేజీ బ్లాక్ బ‌స్ట‌ర్స్ లో న‌టించింది. ద‌శాబ్ధ కాలంగా అగ్ర క‌థానాయిక‌గా తెలుగు -త‌మిళ చిత్ర‌ప‌రిశ్ర‌మ‌ల్లో స్టార్ హీరోల స‌ర‌స‌న అవ‌కాశాలు అందుకుంది. అయితే బాహుబ‌లి లో అవంతిక‌గా న‌టించాక మిల్కీకి అవ‌కాశాలు త‌గ్గిపోవ‌డం ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. అప్ప‌ట్లోనే ఒడిదుడుకులు అధిగ‌మించేందుకు పూర్తిగా త‌మిళ ప‌రిశ్ర‌మ‌కే అంకిత‌మైంది. వ‌రుస‌గా ప్ర‌భుదేవా- కోన బృందం తెర‌కెక్కించిన సినిమాల్లో న‌టించింది. కానీ అవేవీ త‌న‌కు క‌లిసి రాలేదు.

ఆ త‌ర్వాత మ‌ళ్లీ తెలుగు సినీప‌రిశ్ర‌మ‌కు రావడానికి రెండేళ్ల పాటు స‌మ‌యం ప‌ట్టింది. కానీ ఆ కంబ్యాక్ త‌ర్వాత మాత్రం మ‌ళ్లీ తిరుగులేని క‌థానాయిక‌గా టాలీవుడ్ లో క్ష‌ణం తీరిక లేనంత బిజీ అయిపోయింది. చిరు స‌ర‌స‌న సైరా-న‌ర‌సింహారెడ్డిలో న‌టించి మెప్పించింది. 2020 లో స‌రిలేరు నీకెవ్వ‌రు చిత్రంలో మ‌హేష్ ఓ క‌లిసి స్పెష‌ల్ సాంగ్ లో న‌ర్తించిన త‌మ‌న్నా.. ప్ర‌స్తుతం అర‌డ‌జ‌ను చిత్రాల్లో క‌థానాయిక‌గా న‌టిస్తూ బిజీగా ఉంది.

గోపిచంద్ స‌ర‌స‌న సీటీమార్ లో న‌టించింది. ఈ మూవీ త్వ‌ర‌లో రిలీజ్ కి రానుంది. నితిన్ స‌ర‌స‌న `అంధాధున్` రీమేక్.. వెంకీ స‌ర‌స‌న‌ ఎఫ్ 3.. చిత్రాల్లో న‌టిస్తోంది. డైరెక్ట‌ర్ ప్ర‌వీణ్ స‌త్తారు మూవీ.. కేజీఎఫ్ త‌రువాత య‌శ్ చేయ‌బోయే సినిమా.. గుర్తుందా శీతాకాలం.. ఇలా మొత్తం త‌మ‌న్నా చేతిలో అర‌డ‌జ‌ను సినిమాలు ఉన్నాయి. త‌న తోటి హీరోయిన్లంతా ఫేడాఫ్ అవ్వ‌డానికి ద‌గ్గ‌ర‌గా ఉంటే త‌‌మ‌న్నా మాత్రం కొత్త ప్రాజెక్ట్స్ కి క‌మిట‌వుతూ దూసుకుపోతోంది. చూస్తుండ‌గానే రెండు ద‌శాబ్ధాల కెరీర్ ని సునాయాసంగా లాగించేసేట్టే క‌నిపిస్తోంది.