Begin typing your search above and press return to search.

మిల్కీ బ్యూటీ సెకండ్ ఇన్నింగ్స్ మొదలైనట్లేనా?

By:  Tupaki Desk   |   25 Jun 2021 6:30 AM GMT
మిల్కీ బ్యూటీ సెకండ్ ఇన్నింగ్స్ మొదలైనట్లేనా?
X
హీరోయిన్స్‌ ఎక్కువ కాలం పాటు స్టార్స్ గా కొనసాగలేరు. ఎంత పెద్ద స్టార్‌ హీరోయిన్ అయినా కూడా కొంత కాలం తర్వాత ఫేడ్‌ ఔట్ అవ్వాల్సిందే. హీరోలతో పోల్చితే హీరోయిన్స్ కెరీర్‌ స్పాన్‌ తక్కువగా ఉంటుంది. కొందరు హీరోయిన్స్ స్టార్‌ డమ్ తగ్గి ఆఫర్లు తగ్గితే కనిపించకుండా పోతారు. కాని కొందరు మాత్రం సెకండ్‌ ఇన్నింగ్స్‌ ను మొదలు పెట్టి అక్కగా.. అత్తగా కనిపించేందుకు సిద్దం అవుతారు. సెకండ్‌ ఇన్నింగ్స్ కు కొందరు టైమ్ తీసుకుంటే కొందరు మాత్రం వెంటనే మారిపోతారు. తమన్నా స్టార్‌ హీరోయిన్ గా వెలుగు వెలిగి ఇప్పుడు సెకండ్‌ ఇన్నింగ్స్ ను షురూ చేసిందనిపిస్తుంది.

ఒకప్పుడు టాలీవుడ్ స్టార్స్‌ తో పాటు ఇతర భాషల స్టార్స్ తో కూడా ఆడి పాడిన తమన్నా ఇప్పుడు మాత్రం లేడీ ఓరియంటెడ్ చిత్రాలు.. క్యారెక్టర్ ఆర్టిస్టు రోల్స్ ను చేస్తుంది. ఇటీవల ఈమె రెండు వెబ్‌ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. టాలీవుడ్‌ ఏ స్టార్ హీరోయిన్‌ చూపించినంత జోరును ఓటీటీ పై ఈమె చూపిస్తుంది. ఆ రెండు వెబ్‌ సిరీస్ లు నిరాశ పర్చినా కూడా తమన్నా మరో వెబ్‌ సిరీస్ కు గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చింది. అమెజాన్ వారు నిర్మించబోతున్న ఆ వెబ్‌ సిరీస్‌ తో తమన్నా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

యారీ దోస్తీ అనే టైటిల్ తో అరుణియ శర్మ దర్శకత్వంలో రూపొందబోతున్న వెబ్‌ సిరీస్‌ తో తమన్నా ముచ్చటగా మూడవ సారి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మిల్కీ బ్యూటీ తమన్నా ఒక వైపు సినిమా ల్లో మరో వైపు వెబ్‌ సిరీస్ ల్లో నటిస్తూనే త్వరలోనే జెమిని టీవీ ద్వారా ఒక టాక్ షో తో కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల టాక్‌. గతంలోనే ఈమె ఒక టాక్ షో చేయబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. కాని ఆ టాక్ షో మరో హీరోయిన్‌ కు వెళ్లింది. ఇప్పుడు తమన్నా టాక్‌ షో తో రాబోతుంది. ఇలా మిల్కీ బ్యూటీ బిజీ బిజీగా ఉండటంను బట్టి చూస్తే సెకండ్‌ ఇన్నింగ్స్ మొదలు అయినట్లుగా అనిపిస్తుందంటూ నెటిజన్స్ కామెంట్స్‌ చేస్తున్నారు.