Begin typing your search above and press return to search.

మిల్కీ బ్యూటీ మలి ప్రయత్నంలోనైనా సక్సెస్ అయ్యేనా?

By:  Tupaki Desk   |   7 May 2021 1:30 PM GMT
మిల్కీ బ్యూటీ మలి ప్రయత్నంలోనైనా సక్సెస్ అయ్యేనా?
X
రెగ్యులర్‌ సినిమాలతో సమానంగా ఈమద్య కాలంలో వెబ్‌ సిరీస్ లకు కూడా ప్రేక్షకుల నుండి ఆధరణ దక్కుతుంది. ప్రముఖ ఓటీటీలు భారీ బడ్జెట్‌ తో వెబ్‌ సిరీస్ లను నిర్మిస్తున్నాయి. వెబ్‌ సిరీస్ లకు ఉన్న మార్కెట్‌ నేపథ్యంలో ప్రముఖ స్టార్స్ పలువురు వెబ్‌ సిరీస్ ల్లో నటించేందుకు సిద్దంగా ఉంటున్నారు. బాలీవుడ్‌ నుండి కోలీవుడ్‌ వరకు ఎంతో మంది స్టార్స్‌ ఇప్పటికే వెబ్‌ సిరీస్ లతో ఎంట్రీ ఇచ్చారు. సౌత్‌ స్టార్స్ హీరోయిన్స్‌ అయిన కాజల్‌.. సమంత.. తమన్నాలు ఓటీటీ ఎంట్రీ ఇచ్చారు. ఇప్పటికే కాజల్‌ వెబ్‌ సిరీస్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సమంత వెబ్‌ సిరీస్ ది ఫ్యామిలీ మ్యాన్‌ 2 కూడా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక తమన్నా తక్కువ సమయంలోనే రెండవ వెబ్‌ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అయ్యింది.

తమన్నా ఇటీవలే ఆహా లో 11th అవర్‌ వెబ్‌ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ వెబ్‌ సిరీస్ తెలుగు ఆడియన్స్‌ కు కనెక్ట్ అవ్వలేదు. తెలుగులో ఆ రేంజ్‌ కంటెంట్‌ తో కాకుండా కమర్షియల్‌ ఎంటర్‌ టైనర్‌ గా వెబ్‌ సిరీస్ లను తీయాల్సి ఉందంటూ కామెంట్స్ వినిపించాయి. మొత్తంగా 11th అవర్‌ వెబ్‌ సిరీస్‌ నిరాశ పర్చింది. ఆహా లో వచ్చిన ఆ వెబ్‌ సిరీస్‌ నిరాశ పర్చినా కూడా తక్కువ గ్యాప్‌ లోనే కొత్త వెబ్‌ సిరీస్ తో తమన్నా ఓటీటీ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అయ్యింది. తమన్నా నటించిన 'నవంబర్‌ స్టోరీ' స్ట్రీమింగ్‌ కు సిద్దం అయ్యింది. డిస్నీ + హాట్ స్టార్‌ లో ఈనెల 20న స్ట్రీమింగ్‌ అవ్వబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చింది.

తండ్రి హత్య కేసులో ఇరుక్కుంటే ఆయన ప్రతిష్టను కాపాడే కూతురు పాత్రలో తమన్నా నటించింది. నవంబర్ స్టోరీ ట్రైలర్‌ వెబ్‌ సిరీస్ పై ఆసక్తిని కలిగిస్తుంది. అంచనాలకు తగ్గట్లుగా ఉంటుందనే నమ్మకంను మేకర్స్ వ్యక్తం చేస్తున్నారు. మొదటి వెబ్‌ సిరీస్ నిరాశ పర్చగా కనీసం ఈ మలి ప్రయత్నం అయినా తమన్నాకు సక్సెస్‌ ను అందిస్తుందేమో చూడాలి. నవంబర్ స్టోరీ వెబ్‌ సిరీస్‌ సక్సెస్‌ అయితే తమన్నా నుండి మరిన్ని వెబ్‌ సిరీస్ లు రావచ్చు. ఇప్పటికే ఓటీటీ ఎంట్రీ ఇచ్చిన పలువురు ముద్దుగుమ్మలు నిరాశ పర్చారు. తమన్నా రెండవ ప్రయత్నం సక్సెస్ అవుతుందేమో చూడాలి.